క్రికెట్ మ్యాచ్‌లు(T20 world cup 2021 schedule) జరిగేటప్పుడు ఇరుజట్ల ఆటగాళ్ల మధ్య లేదా ప్లేయర్స్-అంపైర్లకు మధ్య ఘర్షణలు జరగడం అప్పుడప్పుడు చూస్తుంటాం. కొంతమంది మధ్య మాటల యుద్ధం జరిగితే మరికొంతమంది కొట్టుకునే వరకు వెళ్లిపోతారు. వాటిలో కొన్ని సంఘటనలు అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అయితే ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో భాగంగా అక్టోబర్ 24న టీమ్ఇండియా-పాకిస్థాన్(pak india match 2021) మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ ఇరు జట్ల మధ్య పోరు అంటే అభిమానులకు ఎనలేని ఆసక్తి. రెండు జట్ల మధ్య మ్యాచ్ ఎప్పుడూ ఆటగాళ్ల దూకుడు ప్రదర్శన, కవ్వింపు చర్యలతో రసవత్తరంగా సాగుతుంది. ఈ నేపథ్యంలో గతంలో ఈ రెండు జట్ల ఆటగాళ్ల మధ్య జరిగిన కొన్ని వివాదాస్పద సంఘటనలను గుర్తుచేసుకుందాం..
మియాందాద్ కుప్పిగంతులు(miandad kiran more)
1992 ప్రపంచకప్‌లో(1992 world cup pak vs india) భాగంగా ఆస్ట్రేలియాలోని సిడ్నీలో భారత్-పాక్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో అప్పటి టీమ్ఇండియా వికెట్ కీపర్ కిరణ్ మోరె పాక్ ఆటగాడు మియాందాద్ మధ్య మటల యుద్ధం జరిగి ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకునేంత వరకు వెళ్లింది.
ఈ మ్యాచ్‌లో భారత్ నిర్దేశించిన 217 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్.. ఏ దశలోనూ నిలకడగా ఆడలేకపోయింది. మ్యాచ్ మధ్యలో కీపర్ కిరణ్ మోరె చేసిన ఔట్ అప్పీల్‌కు మియాందాద్ కోపంతో ఊగిపోయాడు. కుప్పిగంతులు వేస్తూ మోరెను హేళన చేశాడు. అయితే మోరె.. రెండు క్యాచ్‌లు, ఓ రనౌట్, ఓ స్టంపింగ్‌తో భారత విజయంలో కీలకంగా మారితే.. మియాందాద్ మాత్రం 110బంతుల్లో 40 పరుగులు చేసి తమ జట్టు ఓటమికి బాధ్యుడయ్యాడు. ఈ పోరులో సచిన్ అజేయంగా 54 పరుగులు చేయడం సహా ఒక వికెట్ తీశాడు.
సోహైల్‌కు దీటుగా సమాధానం(venkatesh prasad aamir sohail)
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం 1996 ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌కు వేదిక. సెమీస్ బెర్త్ కోసం భారత్, పాక్ మైదానంలో బరిలో దిగాయి. ఈ మ్యాచ్‌లో ఉన్నట్టుంది చిన్న అలజడి మొదలైంది. భారత్ నిర్దేశించిన 287 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సోహైల్ వరుస బౌండరీలతో వెంకటేశ్ ప్రసాద్‌ను రెచ్చగొట్టాడు. ఎక్స్ట్రా కవర్స్‌లో బంతిని కొట్టి 'మళ్లీ అక్కడికే కొడతా వెళ్లి తెచ్చుకో' అంటూ ఎగతాళి చేశాడు. దీంతో వెంకీ తర్వాతి బంతిని ఆఫ్‌స్టంప్ బయటకు వేశాడు. ఆ బాల్‌ను ఆడబోయి సోహైల్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో ఒక్కసారిగా పట్టరాని ఆవేశంతో వెంకీతో మాటల యుద్ధానికి దిగాడు. అలా వారిద్దరి మధ్య పెద్ద గొడవే జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిచింది.
గంభీర్ -అఫ్రిది(gambhir afridi fight)