తెలంగాణ

telangana

ETV Bharat / sports

'టీ20 ప్రపంచకప్​పై తుదినిర్ణయం అప్పుడే' - బీసీసీఐ టీ 20 ప్రపంచకప్​

ఐపీఎల్ వాయిదా పడటం వల్ల టీ20 ప్రపంచకప్​ నిర్వహణపై సందేహాలు వస్తున్నాయి. దీనిపై నిర్ణయం జులైలో తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి భారత క్రికెట్ బోర్డు ఏం చేస్తుందో చూడాలి?

t20
టీ20 ప్రపంచకప్

By

Published : May 5, 2021, 3:27 PM IST

కరోనా కారణంగా ఐపీఎల్‌ నిరవధిక వాయిదా పడింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి మన దేశం ఆతిథ్యమివ్వాల్సిన టీ20 ప్రపంచకప్‌పై పడింది. అక్టోబరు-నవంబరులో జరగాల్సిన ఈ మెగా ఈవెంట్‌ను యూఏఈకి తరలించక తప్పదనే ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పందించిన బోర్డు అధికారి ఒకరు.. ఈ విషయమై చర్చలు జరిపి తుది నిర్ణయం జులైలో బోర్డు తీసుకుంటుందని చెప్పారు.

"ప్రస్తుతం పరిస్థితులను పరిశీలిస్తున్నాం. జులై కన్నా ముందే ఏ నిర్ణయం తీసుకోలేం. త్వరలోనే పరిస్థితులన్నీ సద్దుమణుగుతాయని, ప్రపంచకప్​ ఇక్కడే జరుగుతుందని ఆశిస్తున్నాం. అంతకుముందు ఈ మెగా ఈవెంట్ నిర్వహించడానికి అనుకున్న తొమ్మిది వేదికలపై మరోసారి పరిశీలిస్తాం. దేశవ్యాప్తంగా ఉన్న ఇంకా మరికొన్ని వేదికల కోసం చూస్తున్నాం"

-బీసీసీఐ అధికారి.

అయితే ఈ టీ20 ప్రపంచకప్​ను యూఏఈకి తరలించొచ్చని బోర్డుకు చెందిన మరో అధికారి అన్నారు. కరోనా కారణంగా ఐపీఎల్ వాయిదా పడటం వల్ల ఈ మెగా ఈవెంట్​ను ఇక్కడ నిర్వహించే సాహసం చేయదని చెప్పారు.

ఇదీ చూడండి: టీ20 ప్రపంచకప్ నిర్వహణపై బీసీసీఐ దారెటు?

ABOUT THE AUTHOR

...view details