ఇటీవలి ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఫైనల్‌లో ఫ్రాన్స్‌ను ఓడించి.. అర్జెంటీనా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో.. అర్జెంటీనా స్టార్ ప్లేయర్ మెస్సి తనదైన ఆట శైలితో జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ విజయంతో ఫిఫా ప్రపంచ కప్ ట్రోఫీని ముద్దాడి తన చిరకాల కలను నెరవేర్చుకున్నాడు.
టైటిల్ నెగ్గిన ఆనందంలో మునిగి తేలుతున్న మెస్సి తన అభిమానులు, ఫాలోవర్లను మాత్రం మరిచిపోలేదు. ఇక భారత్‌లోనూ అతడికి పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్న విషయం తెలిసిందే. ధోనీ, కోహ్లీ లాంటి క్రికెటర్లూ అతడిని ఫాలో అవుతుంటారు. ఈ నేపథ్యంలో ధోనీ కూతురు జీవాకు.. మెస్సి తాను సంతకం చేసిన అర్జెంటీనా జెర్సీని పంపి తన ప్రేమను చాటాడు.