కోచ్‌గా రవిశాస్త్రి నేతృత్వంలో విదేశాల్లో ఎన్నో ఘన విజయాలు సాధించిన టీమ్ఇండియా.. ఒక్క ఐసీసీ ట్రోఫీ సాధించలేకపోవడం పెద్ద లోటని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు.
'కోచ్‌గా రవిశాస్త్రి నేతృత్వంలో భారత్ మూడు ఐసీసీ టోర్నీల్లో పాల్గొంది. అయితే, ఒక్క దాంట్లో కూడా ఛాంపియన్‌గా నిలవలేకపోయింది. ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో అయితే కనీసం సెమీ ఫైనల్‌కు కూడా అర్హత సాధించలేకపోయింది. అయితే, ద్వైపాక్షిక సిరీస్‌ల్లో గొప్పగా రాణిస్తోన్న టీమ్ఇండియా.. ఐసీసీ టోర్నీలో మాత్రం చతికిలపడుతోంది. కోచ్‌గా అతడికి ప్రస్తుత టీ20 ప్రపంచకప్పే చివరిది. ఇకపై అతడిని టీమ్ఇండియా కోచ్‌గా చూడలేం. రవిశాస్త్రి లాంటి గొప్ప కోచ్ నేతృత్వంలో భారత్ ఒక్క ట్రోఫీ కూడా సాధించకపోవడం పెద్దలోటే' అని ఆకాశ్ చోప్రా అన్నాడు.
అయితే, కోచ్‌గా రవిశాస్త్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత టెస్టుల్లో టీమ్ఇండియా ఎన్నో మరుపురాని విజయాలు సాధించిందని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.