తెలంగాణ

telangana

By

Published : Apr 28, 2021, 6:35 AM IST

ETV Bharat / sports

ఫాస్ట్​బౌలర్​ నటరాజన్‌కు శస్త్రచికిత్స

మోకాలి గాయంతో ఈ ఐపీఎల్​ సీజన్​కు దూరమైన టీమ్​ఇండియా ఫాస్ట్​బౌలర్​ నటరాజన్​కు శస్త్రచికిత్స విజయవంతంగా జరిగింది. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

natrajan
నటరాజన్‌

మోకాలి గాయంతో ఐపీఎల్‌కు దూరమైన భారత ఫాస్ట్‌బౌలర్‌ నటరాజన్‌కు మంగళవారం శస్త్రచికిత్స జరిగింది. ఇప్పుడు తన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 30 ఏళ్ల నటరాజన్‌ ఐపీఎల్‌-14లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున రెండు మ్యాచ్‌లే ఆడాడు. అతడి మోకాలికి ఆస్ట్రేలియా పర్యటనలోనే గాయమైంది.

ఆ తర్వాత జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)లో పునరావాసానికి వెళ్లిన అతడు ఇంగ్లాండ్‌తో సిరీస్‌ ఆడాడు. ఐపీఎల్‌ సందర్భంగా గాయం తీవ్రత ఎక్కువ కావడం వల్ల అతడికి శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది.

ABOUT THE AUTHOR

...view details