తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఫాస్ట్​ బౌలింగ్​ను మరిచిన జూనియర్లు - 150 కి.మీ. వేసే బౌలర్లు ఇక కనిపించరా?

Fast Bowlers In Cricket : క్రికెట్​ హిస్టరీలో బ్యాటర్లకు ఎంత ఇంపార్టెన్స్​ ఉందే బౌలర్లకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. ఒకప్పటి బౌలర్లు బాల్​ను సంధిస్తే ఇక ఇది 150 కి.మీ వేగంతో బుల్లెట్‌లా దూసుకెళ్లేది. అలాంటి స్కిల్స్​తో ప్రత్యర్థి బ్యాటర్లను వణికించేవాళ్లు. అయితే నేటి తరంలో ఆ కళ కనుమరుగువుతోందంటూ మాజీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఏమైందంటే ?

Fast Bowlers In Cricket
Fast Bowlers In Cricket

By ETV Bharat Telugu Team

Published : Jan 10, 2024, 11:18 AM IST

Fast Bowlers In Cricket : "ఫాస్ట్‌ బౌలింగ్‌ అనేది ఈ మధ్య కాలంలో తగ్గిపోయింది. 150 కి.మీ వేగంతో బంతులు వేసే బౌలర్లే కనుమరుగైపోయారు. ఇప్పుడున్న వాళ్లను ఏమాత్రం ఫాస్ట్‌ బౌలర్లు అని అనలేం" అని సౌతాఫ్రాకి మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ అలెన్‌ డొనాల్డ్‌ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో అన్నారు. వాస్తవానికి ఫాస్ట్‌ బౌలింగ్‌ అనేది ఓ కళ. కుట్ల బంతిని ఒడుపుగా పట్టుకుని వదిలితే బుల్లెట్‌లా దూసుకెళ్లేది. ఒకప్పుడు వెస్టిండీస్‌ స్టార్​ బౌలర్ మాల్కమ్‌ మార్షల్, జోయల్‌ గార్నర్, ఆండీ రాబర్ట్స్, మైకేల్‌ హోల్డింగ్​లు ప్రత్యర్థులకు ఎలా కళ్లెం వేసేవాళ్లో ఇప్పటికీ మాట్లాడుకుంటుంటారు. ఇలా వెస్టిండీస్‌ మాత్రమే కాదు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, పాకిస్థాన్‌, న్యూజిలాండ్​ జట్లలోనూ మెరుపు పేసర్లు ఉండేవాళ్లు. కానీ నెమ్మది ఆ సంఖ్య తగ్గిపోయింది.

150 కిలోమీటర్ల వేగంతో బంతులను వేసే బౌలర్ల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. బ్రెట్‌ లీ, షోయబ్‌ అక్తర్, షేన్‌ బాండ్‌ తరం తర్వాత మళ్లీ అంతటి స్పీడ్‌తో స్థిరంగా బాల్స్​ను వేయగల పేసర్లు కరువయ్యారు. పేస్‌కు భారత్‌ ఎప్పుడూ పెట్టింది పేరు కాకపోయినప్పటికీ ఇటీవలి కాలంలో బుమ్రా, షమి, సిరాజ్‌లతో బలంగా ఉంది. కానీ వీళ్లెవరూ స్థిరంగా గంటకు 150 కి.మీ వేగంతో బంతులు వేసేవాళ్లు కాదు. తమ నైపుణ్యంతోనే ఈ యంగ్​ స్టార్స్ ఎక్కువగా వికెట్లు తీస్తున్నారు.

అయితే ప్రస్తుత క్రికెటర్లు ఊపిరి సలపని షెడ్యూల్‌తో బిజీ బిజీగా ఉంటున్నారు. అటు అంతర్జాతీయ మ్యాచ్‌లతో పాటు, ఇటు టీ20 లీగ్‌లను బ్యాలెన్స్‌ చేసుకుంటూ పోతున్నారు. దీంతో వాళ్లకు సరైన విశ్రాంతి దొరకటం లేదు. ఎక్కువ మ్యాచ్‌లు కూడా ఆడటం వల్ల భారం పెరిగి పేస్‌ కూడా తగ్గిపోతోంది. పైగా ఎక్కువ శ్రమ పెడితే ఎక్కడ గాయాలు అవుతాయో అన్న భయం కూడా పేసర్లను వెంటాడుతోంది. అందుకే 150 కి.మీ వేగం అనే మాటని చాలామంది దాటవేస్తున్నారు. వేగాన్ని పక్కనపెట్టి వైవిధ్యంగా బౌలింగ్‌ చేయడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు.

మరికొందరైతే కాస్త స్పీడ్‌గా బాల్స్​ వేసి స్పిన్నర్లుగా మారారు. ఆరంభంలో మంచి వేగంతో బంతులు వేసిన భువనేశ్వర్‌ కుమార్‌ ఆ తర్వాత కాస్త వేగంతో బంతులు విసిరే బౌలర్‌గా రూపాంతరం చెందాడు. గాయాలు కూడా ఇందుకు కారణం. ఒకప్పుడు మెరుపు వేగంతో బంతులేసి ఆ తర్వాత స్లో మీడియం పేసర్‌గా మారిన మునాఫ్‌ పటేల్‌ కూడా ఈ కోవకు చెందినవాడే. ఒకప్పటి ఆల్‌రౌండర్‌ మనోజ్‌ ప్రభాకర్‌ కూడా ఇంతే. అతడు ఇంకా దారుణంగా కెరీర్‌ చివర్లో స్పిన్‌ కూడా వేసేవాడు.

అయితే ఐపీఎల్‌లో ఉమ్రాన్‌ మాలిక్‌ ఇలాంటి వేగంతోనే వికెట్లు తీశాడు. క్రమం తప్పకుండా ప్రతి మ్యాచ్‌లోనూ 150 కి.మీ వేగంతో బంతిని వేసి ఔరా అనిపించాడు. అలా వేగవంతమైన బౌలర్‌ అవార్డును ప్రతిసారీ అతడే దక్కించుకున్నాడు. అయితే స్పీడ్‌ ఉంటే సరిపోదు కంట్రోల్​ కూడా ఉండాలనే ప్రాథమిక సూత్రాన్ని పక్కనపెట్టి రన్‌లు ఇచ్చే మెషీన్‌గా మారిపోయాడు. దీంతో భారత జట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ అంతగా నిలబెట్టుకోలేకపోయాడు.

ఇక బ్రెట్‌లీ, షోయబ్‌ అక్తర్‌ భీకర పేస్‌తో బంతులు వేసినప్పటికీ లైన్‌ అండ్‌ లెంగ్త్‌కు కట్టుబడి ఉండటం వల్లే వికెట్లు తీయగలిగారు. ఈ విషయంలో ఫెర్గూసన్, మార్క్‌ వుడ్‌ ఫెర్గూసన్, కాస్త నయం. ప్రస్తుత తరంలో వేగంగా బంతులు వేయడంలో వీళ్లిద్దరూ ముందున్నారు.

జోఫ్రా ఆర్చర్‌ సైతం ఆరంభంలో నుంచే మెరుపు వేగంతో బంతులు సంధించేవాడు. కానీ విపరీతమైన క్రికెట్లో పడి గాయాల పాలయ్యాడు. దీంతో మునుపటి వేగంతో బంతులు వేయట్లేదు. వేగంగా బంతులు వేయాలన్న కాన్సెప్ట్‌ ప్రస్తుత బౌలర్లకు ఉండట్లేదు. దీంతో ఈ నైపుణ్యం కూడా క్రమ క్రమంగా మరుగునపడిపోతోంది.

RAW బౌలింగ్‌కు పెట్టింది పేరైన వెస్టిండీస్, పాకిస్థాన్‌ బౌలర్లు సైతం ఫాస్ట్‌ కళకు ఓటేయ్యడం లేదు. షహీన్‌షా అఫ్రిది లాంటి సక్సెస్‌ఫుల్‌ బౌలర్‌ కూడా 150 వేగంతో బంతులు వేయలేని పరిస్థితి నెలకొంంది. మరి వేగానికి మారుపేరుగా నిలిచే ఫాస్ట్‌ బౌలర్లు ఇకనైనా వస్తారేమో వేచి చూడాల్సిందే.

ఐపీఎల్​లో మెరిసిన బౌలర్లు.. డాట్​ బాల్స్​లో షమీ టాప్​.. సిరాజ్ స్థానం ఎంతంటే​!

ODI World Cup 2023 Mitchell Starc Record : ఆసీస్ బౌలర్ అరుదైన రికార్డు.. వన్డే ప్రపంచకప్‌ చరిత్రలోనే అలా!

ABOUT THE AUTHOR

...view details