వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ క్రిస్ గేల్ అంటే ఐపీఎల్ చూసే ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఐపీఎల్‌కు రాకముందు నుంచే ఇతని గురించి తెలిసినప్పటికీ ఆర్సీబి తరఫున ఆడినప్పుడు ఈ జమైకా ప్లేయర్ పాపులారిటీ మరింత పెరిగింది. అలా టీమ్‌కు ఓ స్ట్రాంగ్ పిల్లర్‌లా కూడా మారాడు గేల్. కానీ తనకు ఇంత పేరు ప్రతిష్ఠలు తెచ్చిపెట్టిన ఫ్రాంచైజీపై క్రిస్ గేల్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. తాను ఆడిన మరో మాజీ జట్టు పంజాబ్ కింగ్స్‌పై కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు.
ఆర్సీబీపై క్రిస్ గేల్ షాకింగ్ కామెంట్స్.. ఇలా అనేశాడేంటి! - క్రిస్ గేల్ కామెంట్స్
వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ క్రిస్ గేల్ తన ఐపీఎల్ టీమ్ గురించి ఓ షాకింగ్ కామెంట్ చేశాడు. అంతే కాకుండా తన మాజీ టీమ్‌పైన కూడా ఇటువంటి కామెంట్స్ చేశాడు. దీంతో ఫ్యాన్స్ అతని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే..ఇటీవలే టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్పతో కలిసి గేల్ ఓ షో లో ముచ్చటించాడు. ఈ క్రమంలో ఊతప్ప.. 'ఆర్సీబీ అంటే కేవలం విరాట్, ఏబీ డివిలియర్స్ అనే అనుకుంటారు కదా' అని అన్నాడు. ఈ ప్రశ్నకు స్పందించిన గేల్ అది నిజమే అని సమాధానమే ఇచ్చాడు. "ఆర్సీబీ, పంజాబ్ జట్లు ఈ విషయంలో ఇంకా చాలా నేర్చుకోవాలి. ఆటగాళ్లను నమ్మడం, లాయల్‌గా ఉండటం గురించి వాళ్లు అర్థం చేసుకోవాలి. ఆర్సీబీలో ఉన్న ఆటగాళ్లు తాము ఆ ఫ్రాంచైజీలో భాగం అని ఎప్పటికీ అనుకోరు" అని చెప్పాడు. ఈ కామెంట్స్ విన్న ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనయ్యారు. క్రిస్ గేల్ ఇలా మాట్లాడటం అసలు సరికాదని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయం వ్యక్తం చేశారు.