ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీకి విడదీయరాని అనుబంధం ఉంది. అంతటి ఆటగాడికి 2021 ఐపీఎల్ సీజన్లో ఛేదు అనుభవం ఎదురైంది. కెప్టెన్సీతో పాటు ఆటగాడిగా జట్టుకు దూరమయ్యాడు. అసలు దీని వెనుక ఎవరున్నారనే విషయంపై తాజాగా స్పందించాడు వార్నర్.
వార్నర్ సారథిగా 2016లో హైదరాబాద్ జట్టుకు ఐపీఎల్ టైటిల్ అందించాడు వార్నర్. గత మూడు సీజన్ల నుంచి సన్‌రైజర్స్ బ్యాటింగ్ విభాగానికి డేవిడ్ వెన్నెముకలా ఉన్నాడు. టీమ్ నుంచి తప్పించడానికి కారణమైన వ్యక్తి ఎవరంటూ ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు.. నవ్వుతున్న ఎమోజీలను బదులుగా పెట్టాడు వార్నర్. పేరు మాత్రం వెల్లడించలేదు.
నిలకడలేమి..