పాకిస్థాన్ సూపర్‌లీగ్‌లో ఆడుతున్న దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(faf du plessis) గాయంతో ఆస్పత్రిలో చేరాడు. శనివారం పీఎస్ఎల్లో క్వెట్టా గ్లాడియేటర్స్(Quetta Gladiators) తరఫున ఆడుతున్న డుప్లెసిస్.. పెషావర్ జల్మీతో జరిగిన మ్యాచ్‌లో బౌండరీని ఆపబోయి క్రమంలో గాయపడ్డాడు.
PSL 2021: గాయంతో ఆస్పత్రి పాలైన మరో క్రికెటర్
పాకిస్థాన్ సూపర్‌లీగ్(Pakistan Super League)లో మరో విదేశీ క్రికెటర్ గాయంతో మైదానాన్ని వీడాడు. అంతకుముందు క్వెట్టా గ్లాడియేటర్స్(Quetta Gladiators) జట్టులోని ఆల్‌రౌండర్ ఆండ్రూ రస్సెల్(Andre Russell) తలకు బంతి తగిలి ఆస్పత్రిలో చేరగా.. ఇప్పుడు అదే జట్టులోని మరో ఆటగాడు ఫాఫ్ డుప్లెసిస్(faf du plessis) గాయంతో మైదానాన్ని వీడాడు.
PSL 2021: గాయంతో ఆస్పత్రి పాలైన మరో క్రికెటర్
శనివారం పెషావర్ జల్మీతో జరిగిన మ్యాచ్ 7 ఓవర్లో బౌండరీని ఆపడానికి ఫాఫ్ డుప్లెసిస్ డైవ్ చేశాడు. అప్పుడే ఎదురుగా పాకిస్థాన్ క్రికెటర్ మొహమ్మద్ హస్నైన్(Mohammad Hasnain) కాలు డుప్లెసిస్ తలకు బలంగా తాకింది. దీంతో నొప్పితో డుప్లెసిస్ విలవిలలాడగా.. వెంటనే అతడిని ఆస్పత్రిలో చేర్చారు. కొంత సమయం తర్వాత క్వెట్టా గ్లాడియేటర్స్ డగౌట్లో డుప్లెసిస్ విశ్రాంతి తీసుకుంటూ కనిపించాడు.
ఇదీ చూడండి:PSL 2021: రస్సెల్ తలకు గాయం.. ఆస్పత్రికి తరలింపు