పాకిస్థాన్ సూపర్ లీగ్(PSL)లో భాగంగా క్వెట్టా గ్లాడియేటర్స్(Quetta Gladiators) తరఫున ఆడుతున్న దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(Faf Du Plessis) కంకషన్‌కు గురయ్యాడు. దీంతో డుప్లెసిస్ త్వరగా కోలుకొని మైదానంలో అడుగుపెట్టాలని అభిమానులు సోషల్‌మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. వీటిపై స్పందించిన డుప్లెసిస్.. తాను ప్రస్తుతం కోలుకుంటున్నట్లు తెలిపాడు.
"నేను కోలుకోవాలని మీరు చూపించే ప్రేమకు ధన్యావాదాలు. ప్రస్తుతం హోటల్‌కు తిరిగి వచ్చాను. కొంత జ్ఞాపకశక్తి తగ్గడం వల్ల కంకషన్‌కు గురయ్యాను. అయినా నేను బాగానే ఉన్నాను. త్వరలోనే మైదానంలో అడుగుపెడతానని భావిస్తున్నా".
- ఫాఫ్ డుప్లెసిస్, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్
శనివారం రాత్రి పెషావర్ జాల్మీ(Peshawar Zalmi) జట్టుతో మ్యాచ్ ఆడుతుండగా సహచర ఆటగాడు మహ్మద్ హస్నేన్(Mohammad Hasnain)ను బలంగా ఢీకొని కిందపడిపోయాడు. దాంతో వెంటనే పరీక్షించిన అక్కడి ఫిజియోలు అతడిని మైదానం నుంచి బయటకు తీసుకెళ్లారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే, గ్లాడియేటర్స్ జట్టులో ఇలా రెండు రోజుల వ్యవధిలో ఆటగాళ్లు కంకషన్‌కు గురవ్వడం ఇది రెండోసారి.
అంతకుముందు ఇస్లామాబాద్ యునైటెడ్(Islamabad United)తో జరిగిన మ్యాచ్‌లో గ్లాడియేటర్స్ ఆటగాడు ఆండ్రీ రసెల్(Andre Russell) బ్యాటింగ్ చేస్తూ కంకషన్‌కు గురయ్యాడు. ప్రత్యర్థి బౌలర్ మహ్మద్ ముసా వేసిన ఓ బౌన్సర్ అతడి హెల్మెట్‌కు తగలడం వల్ల తలకు దెబ్బ తగిలింది. దాంతో రసెల్‌నూ ఆ మ్యాచ్ నుంచి తప్పించారు. ఇప్పుడు డుప్లెసిస్ గాయపడడం వల్ల అతడి సతీమణి ఇమారి ఇన్‌స్టాగ్రామ్‌లో ఆందోళన వ్యక్తం చేసింది. అతడికి ఎలా ఉందోనని కంగారుపడింది. తనకు చాలా బాధగా ఉందని వ్యాఖ్యానించింది.
ఇదీ చూడండి..IND vs SL: సంజూ.. ధోనీని చూసి నేర్చుకో!