తెలంగాణ

telangana

ETV Bharat / sports

'పాకిస్థాన్​ జెర్సీ పండ్ల దుకాణంలా ఉంది'.. మాజీ స్పిన్నర్​ సెటైర్​ - t20 world cup updates

Pakistan New Jersey: పాకిస్థాన్​ టీమ్​పై సెటైర్లు వేశాడు ఆ దేశ మాజీ స్పిన్నర్ డానిష్‌ కనేరియా​. జట్టు జెర్సీని చూస్తే తనకు ఏదో గుర్తుస్తోందని కామెంట్​ చేశాడు. ఇంతకీ అతనికి ఏం గుర్తొచ్చిందో తెలుసుకుందామా..

ex-spinner-danish-comments-on-pakistans-t20-world-cup-jersey
ex-spinner-danish-comments-on-pakistans-t20-world-cup-jersey

By

Published : Sep 22, 2022, 7:11 AM IST

Pakistan New Jersey: ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్‌ కోసం 12 జట్లతోపాటు క్వాలిఫయిర్‌ రౌండ్‌లో పాల్గొనే టీమ్‌లూ సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే తమ స్క్వాడ్‌లను ప్రకటించిన జట్లు.. కొత్త జెర్సీలతో దర్శనమిచ్చేందుకు ఏర్పాట్లు చేశాయి. అందులో భాగం పాకిస్థాన్‌ కూడా తమ నూతన జెర్సీని రూపకల్పన చేసి విడుదల చేసింది. ఈ క్రమంలో తమ క్రికెట్ జట్టు కొత్త జెర్సీపై పాక్‌ మాజీ స్పిన్నర్‌ డానిష్‌ కనేరియా సెటైర్లు వేశాడు. "ప్రపంచకప్‌ కోసం బరిలోకి దిగబోతున్నాం. ఆసియా కప్‌ తర్వాత మరోసారి భారత్-పాకిస్థాన్‌ జట్ల నుంచి మెరుగైన ప్రదర్శన ఆశిస్తున్నాం. కానీ ఒకటేమో ఇంగ్లాండ్‌పై ఓడింది. మరొక జట్టేమో ఆసీస్‌ చేతిలో పరాజయం పాలైంది. ఆసియాలోనే టాప్‌ జట్లకు ఏమైంది..? వరల్డ్‌ కప్‌కు సమయం కూడా ఎక్కువ లేదు" అని డానిష్‌ పేర్కొన్నాడు.

భారత్, పాకిస్థాన్ జట్లు కొత్త జెర్సీలను ప్రకటించిన విషయం తెలిసిందే. పాకిస్థాన్ తన జెర్సీకి 'థండర్‌ జెర్సీ' అని పేరు కూడా పెట్టుకుంది. అయితే దీనిపై డానిష్ కనేరియా స్పందించాడు. "తొలుత పాకిస్థాన్‌ కిట్‌ గురించి మాట్లాడతా. ఆ జెర్సీని చూస్తే పుచ్చకాయను చూసినట్లు అనిపిస్తోంది. అలాగే పండ్లతో ముక్కలను డిజైన్లుగా రూపొందించినట్లు ఉంది. దానిని చూస్తే పండ్ల దుకాణంలో నిలబడి ఉన్నట్లుగా ఉంది. భారత జట్టు జెర్సీ కలర్‌ కొంచెం లైట్‌గా ఉంది. కాస్త డార్క్‌గా ఉంటే బాగుండేది. అప్పుడే జోష్‌గా ఉంటుంది. లేకపోతే ఆ కలర్‌ మాదిరిగానే డల్‌గా అనిపిస్తుంది. ఆసీస్‌తో తొలి టీ20లో కానీ భారత బౌలింగ్‌ ఉన్నట్లుగా.." అని డానిష్ కనేరియా వ్యాఖ్యానించాడు.

ABOUT THE AUTHOR

...view details