2019 వన్డే ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మకు భారత సెలెక్టర్లు టీ అందించారని మాజీ వికెట్ కీపర్ ఫరూక్ ఇంజినీర్ గతంలో చేసిన వ్యాఖ్యలను నాటి చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ కొట్టిపారేశారు. తాజాగా ఓ క్రీడాఛానెల్‌తో మాట్లాడిన ఆయన ఆ వివాదాస్పద వ్యాఖ్యలపై తనదైన శైలిలో స్పందించారు. అందులో తమ సెలక్టర్లను అనవసరంగా లాగారని పేర్కొన్నారు.
"స్టార్ ఆటగాళ్లు లేని సమయంలో టీమ్‌ఇండియా యువ క్రికెటర్లు ఆస్ట్రేలియా లాంటి బలమైన జట్టును వారి సొంతగడ్డపై ఓడించినప్పుడు ఎవరూ సెలెక్టర్లను అభినందించలేదు. ఎవరూ అభినందించకపోయినా మాకేం ఫర్వాలేదు. జట్టు యాజమాన్యం తమ పనితీరును గుర్తించి గౌరవించింది. మాకదే చాలు, బయటివాళ్లు ఏమనుకున్నా ఫర్వాలేదు. తాము ఏం పని చేశామో బోర్డు సభ్యులకు తెలుసని, ముఖ్యంగా టీమ్‌ఇండియా బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, పరాస్ మాంబ్రేకు బాగా తెలుసు."