తెలంగాణ

telangana

ETV Bharat / sports

క్రికెట్​కు ఆసీస్ మాజీ కెప్టెన్ పైన్ కొన్నాళ్లు దూరం - టిమ్ పైన్ రిటైర్మెంట్

ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా యాషెస్ సిరీస్ నేపథ్యంలో టెస్టు జట్టు మాజీ సారథి టిమ్​ పైన్(tim paine news) అంశం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో పైన్ కీలక ప్రకటన చేశాడు. కొద్ది రోజుల పాటు క్రికెట్​కు దూరంగా ఉండనున్నట్లు పేర్కొన్నాడు.

tim paine
టిమ్ పైన్

By

Published : Nov 26, 2021, 8:19 AM IST

Updated : Nov 26, 2021, 10:19 AM IST

Tim Paine News: ఆస్ట్రేలియా టెస్టు జట్టు మాజీ సారథి టిమ్ పైన్​ కొద్ది రోజుల పాటు క్రికెట్​లోని అన్ని ఫార్మాట్లకు దూరం కానున్నాడు. భవిష్యత్తు కార్యాచరణ దృష్ట్యా అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు క్రికెట్ టాస్మానియా తెలిపింది. సెక్స్ చాటింగ్ వివాదం(ఓ మహిళా సహోద్యోగురాలికి అసభ్యకర సందేశాలు పంపడం) కారణంగా టిమ్​ పైన్​ ఇటీవలే టెస్టు సారథిగా తప్పుకొంటున్నట్లు ప్రకటించాడు. త్వరలో జరిగే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ యాషెస్ సిరీస్​(Ashes series 2021) నేపథ్యంలో పైన్​కు అవకాశం వస్తుందా? లేదా? అనే అంశం చర్చనీయాంశమైంది.

డిసెంబర్ 8న ప్రారంభం కానున్న యాషెస్​ సిరీస్​కు టిమ్​ పైన్​ను ఎంపిక చేయాలని పలువురు ఆసీస్ క్రికెటర్లు కోరారు. ఈ నేపథ్యంలో పైన్.. కొద్ది రోజుల పాటు క్రికెట్​కు దూరంగా ఉండనున్నట్లు క్రికెట్ టాస్మానియాకు తెలిపినట్లు సమాచారం.

పైన్​కు మద్దతుగా..

ఆస్ట్రేలియా ఆటగాళ్లంతా పైన్​కు మద్దతుగా ఉన్నారని ఇటీవలే తెలిపాడు బౌలర్ నాథన్(Nathan lyon News). గబ్బా వేదికగా జరగనున్న తొలి టెస్టులో పైన్​కు అవకాశం ఇవ్వాలని అభిప్రాయపడ్డాడు. పాట్ కమిన్స్ లేదా స్మిత్​కు టెస్టు సారథి బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందని పేర్కొన్నాడు.

"యాషెస్ సిరీస్​ కోసం ఉత్తమ ఆటగాళ్లను ఎంపిక చేస్తామని సెలెక్టర్లు చెప్పారు. నా దృష్టిలో టిమ్ పైన్ ప్రపంచంలోనే అత్యుత్తమ వికెట్ కీపర్. ఓ బౌలర్​గా జట్టులో మంచి వికెట్​ కీపర్​ ఉండాలని నేను ఆశిస్తాను. బౌలర్లందరి అభిప్రాయం కూడా ఇదే."

--నాథన్ లైయన్, ఆస్ట్రేలియా బౌలర్.

జట్టుపై తీవ్ర ప్రభావం..

టిమ్​ పైన్​పై వచ్చిన ఆరోపణల ప్రభావం యాషెస్​ సిరీస్​పై తీవ్రంగా ఉంటుందని అన్నాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్. పైన్​ స్థానంలో వికెట్ కీపర్​గా అలెక్స్​ కేరీ ఎంపికయ్యే అవకాశాలున్నాయని అన్నాడు.

ఇదీ చదవండి:

పైన్ సెలక్షన్​ను వాళ్లు చూసుకుంటారు: బెయిలీ

Tim Paine: 'ఆ అసభ్య సందేశాలు బయటకొస్తాయని తెలుసు'

Last Updated : Nov 26, 2021, 10:19 AM IST

ABOUT THE AUTHOR

...view details