తెలంగాణ

telangana

ETV Bharat / sports

పాయింట్​ బ్లాక్​లో గన్​ పెట్టి, బట్టలు విప్పేసి కొట్టారు: మాజీ క్రికెటర్​ - australia cricketer Stuart MAC Gill naked

Stuart MAC Gill kidnap: ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్​ స్టువర్ట్​ మెక్​గిల్.. తాను కిడ్నాప్​ అయిన సంఘటనను గుర్తుచేసుకున్నాడు. దానికి సంబంధించి సంచలన విషయాలను బయటపెట్టాడు. దుండగులు తనను పాయింట్​ బ్లాక్​లో గన్​ పెట్టి.. నగ్నంగా మార్చి బాగా కొట్టారని చెప్పాడు.

Stuart MAC Gill kidnap
మెక్​ గిల్​

By

Published : Jun 19, 2022, 10:55 AM IST

Updated : Jun 19, 2022, 11:31 AM IST

Stuart MAC Gill kidnap: ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్​ స్టువర్ట్​ మెక్​గిల్​.. తన కిడ్నాప్​కు సంబంధించి సంచలన విషయాలను తెలిపాడు. గతేడాది తనను కిడ్నాప్​ చేసిన దుండగులు నగ్నంగా మార్చి పాయింట్​ బ్లాక్​లో గన్​ పెట్టి బెదిరించారని చెప్పాడు.

"ఇలాంటి ఘటన.. మనం అత్యంత అసహ్యించుకునే శత్రువులకు కూడా జరగకూడదు. కొంతమంది నా ఇంటికి వచ్చి బలవంతంగా ఎత్తుకెళ్లారు. నా కళ్లకు గంతలు క్టటి కార్​లో ఎక్కించి ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదు. ఓ చోటకు తీసుకెళ్లి నగ్నంగా మార్చి బాగా కొట్టారు. పాయింట్​ బ్లాక్​లో గన్​ పెట్టి కాల్చేస్తామని బెదిరించారు. అప్పుడు నేను చాలా భయపడ్డాను. తీవ్రంగా గాయపడ్డాను. నన్ను చితక్కొట్టిన తర్వాత కార్​ డిక్కీలో కుక్కి.. నన్ను బెల్మోర్​ పడేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత కొద్ది రోజుల పాటు ఇంటికి వెళ్లలేదు. ఓ మిత్రుడు నన్ను హోటల్​లో మూడు, నాలుగు వారాల పాటు ఉంచాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చేసరికి.. కేసుతో సంబంధం ఉన్న నలుగిరిని పోలీసులు అరెస్ట్​ చేశారు." అని పేర్కొన్నాడు.

1998-2008 మధ్య ఆసీస్​ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన మెక్ గిల్.. టెస్టు, వన్డే ఫార్మాట్లలో ఆడాడు. సుదీర్ఘ ఫార్మాట్​లో 44 టెస్టులాడిన మెక్​గిల్​ 208 వికెట్లు సాధించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్​లో మూడు మ్యాచ్​లాడి 6 వికెట్లను తీశాడు.

ఇదీ చూడండి: ప్రముఖ ఇంగ్లాండ్​ పేసర్​​ టెస్టు క్రికెట్​కు గుడ్​బై

Last Updated : Jun 19, 2022, 11:31 AM IST

ABOUT THE AUTHOR

...view details