టీ20 జట్టులో ఆల్రౌండర్లు కీలక పాత్ర పోషిస్తారని టీమ్ఇండియా మాజీ సారథి కపిల్ దేవ్(Kapil Dev All Rounder ) అన్నాడు. ఆల్రౌండర్లపై భారత జట్టు మరింత శ్రద్ధ వహించాలని సూచించాడు. ప్రస్తుతం భారత జట్టులో గొప్ప నైపుణ్యం ఉన్న ఆటగాళ్లున్నారని ప్రశంసించాడు. అయితే.. బ్యాటింగే కాకుండా బౌలింగ్ చేయడానికీ ప్రయత్నించాలని.. కీలక సమయాల్లో అది ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డాడు.
"ఒకవేళ ఓ ఆటగాడికి గాయమైతే.. టీమ్ వేరే ఆటగాడితో సరిపెట్టుకుంటుంది. కానీ, ఆల్రౌండర్లు ఇద్దరూ గాయపడితే.. చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి. ఇలాంటి సమస్యలు రాకుండా బ్యాటింగ్ ఆల్రౌండర్ ఒకరు, బౌలింగ్ ఆల్రౌండర్ ఒకరు జట్టులో ఉండటం చాలా మంచిదని నా అభిప్రాయం. సచిన్ తెందుల్కర్, సౌరవ్ గంగూలీ బ్యాట్స్మెన్. కానీ, వాళ్లు క్లిష్ట పరిస్థితుల్లో బౌలింగ్ కూడా చేయగలరు. విరాట్, రోహిత్ మాత్రం అసలు బౌలింగ్ చేయడం లేదు. టీ20లో ఇలా ఉండకూడదు. ప్రతి ఒక్కరు కొన్ని ఓవర్లైనా వేయడానికి ప్రయత్నించాలి."
-కపిల్ దేవ్, టీమ్ఇండియా మాజీ కెప్టెన్.