మార్చి 2న భారత్- ఆసీస్ మధ్య జరగనున్న తొలివన్డే మ్యాచ్‌కు ఇరు జట్ల సభ్యులు హైదరాబాద్ చేరుకున్నారు. కంగారూలతో ఐదు వన్డేల సిరీస్ ఆడనుంది టీమిండియా. ఇప్పటికే టీ 20 సిరీస్ కోల్పోయిన కోహ్లీసేన వన్డే సిరీస్ గెలవాలనే పట్టుదలతో ఉంది. భాగ్యనగరంలోని ఉప్పల్ స్టేడియం మ్యాచ్‌కు వేదిక కానుంది.
చివరి సిరీస్‌కు సై - aus
ఇప్పటికే టీ 20 సిరీస్ కోల్పోయిన కోహ్లీసేన.. వన్డే సిరీస్ గెలవాలని పట్టుదలతో ఉంది. ఆసీస్‌తో తొలి వన్డే హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరగనుంది.
భారత జట్టు
ప్రపంచకప్ ముందు భారత్ ఆడే చివరి సిరీస్ ఇదే. ఎలాగైనా ఆసీస్‌పై ఆధిపత్యం ప్రదర్శించి.. ఆత్మవిశ్వాసంతో వరల్డ్‌కప్ బరిలోకి దిగాలని కోహ్లీసేన భావిస్తోంది. మరో పక్క ఆస్ట్రేలియా టీ 20 సిరీస్ మాదిరే వన్డేల్లోనూ గెలవాలనే పట్టుదలతో ఉంది. టీ-20ల్లో మాక్స్వెల్ అద్భుత ప్రదర్శనతో భారత్‌కు సిరీస్ ఓటమిని మిగిల్చాడు. ఫలితంగా, వన్డేల్లోనూ కీలకంగా మారనున్నాడీ దూకుడైన బ్యాట్స్‌మెన్.