శ్రీలంక పర్యటనలో ఉన్న భారత జట్టు ఉత్తమంగా రాణిస్తోందని అభిప్రాయపడ్డాడు పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా. ప్రస్తుత పాకిస్థాన్ జట్టును ఈ టీమ్ కచ్చితంగా ఓడించగలదని జోస్యం చెప్పాడు. భారత జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలో యువ ఆటగాళ్లు ఫామ్‌లోకి వచ్చారని ప్రశంసించాడు.
"శ్రీలంక పర్యటనలో ఉన్న భారత జట్టు ప్రదర్శనతో పాటు.. టీమ్ ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ విధానాన్ని మెచ్చుకోకుండా ఉండలేము. ద్రవిడ్.. కుల్దీప్ను ప్రేరేపించిన విధానం బాగుంది. భారత్-బి టీమ్‌గా పిలుస్తున్న ఈ జట్టు పాకిస్థాన్ క్రికెట్ జట్టును కచ్చితంగా ఓడించగలదు."
- డానిష్ కనేరియా, పాకిస్థాన్ మాజీ క్రికెటర్