Pak Allrounder Mushtaq Mohammad Interview: టీ20 ప్రపంచకప్ 2022 తుదిదశకు చేరుకుంది. ఆదివారం మెల్బోర్న్ వేదికగా.. పాకిస్థాన్, ఇంగ్లాండ్ జట్లు అమీతుమీ తేల్చుకున్నాయి. అయితే సరిగ్గా 30 ఏళ్ల తర్వాత అదే గ్రౌండ్లో ఇంగ్లాండ్తో పాక్ జట్టు తలపడనుంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ జట్టు మాజీ సారథి, ఆల్రౌండర్ ముస్తాక్ మహ్మద్.. ఈటీవీ భారత్కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఈటీవీ భారత్: ఒకే వేదికపై 30 ఏళ్ల తర్వాత చరిత్ర పునరావృతం కానుంది, దానిపై మీ స్పందన ఏంటి?
ముస్తాక్: అవును ఎంసీజీలో చరిత్ర పునరావృతం కానుంది! ఇదొక రసవత్తరమైన మ్యాచ్. అందులో ఎటువంటి సందేహం లేదు.
ఈటీవీ భారత్: ఇంగ్లాండ్, పాకిస్థాన్ జట్లపై మీ అభిప్రాయం?
ముస్తాక్:ప్రపంచంలోని అత్యుత్తమ జట్లలో ఇంగ్లాండ్ ఒకటి. అయితే టోర్నీ ఫైనల్కు అదృష్టంతో చేరుకున్న పాకిస్థాన్ జట్టు తమ దేశంపై మంచి అభిప్రాయాన్ని ఉంచుకుని మ్యాచ్ ఆడాలి.
ఈటీవీ భారత్: ప్రపంచకప్లో పాకిస్థాన్ జర్నీ గురించి చెప్పండి?
ముస్తాక్:మొదట్లో పాకిస్థాన్ జట్టు అంతగా ఆడలేదు. క్రమంగా ఆటగాళ్లు ఊపందుకున్నారు. అలా మంచి ప్రదర్శన ఇవ్వడం ప్రారంభించారు. ప్రస్తుతం పాకిస్థాన్ బౌలింగ్ పటిష్ఠంగా ఉంది.