తెలంగాణ

telangana

ETV Bharat / sports

రిటైర్మెంట్​ ప్రకటించిన వరల్డ్​కప్​ విన్నింగ్​ కెప్టెన్​

Eoin Morgan retirement: ఇంగ్లాండ్​ కెప్టెన్​ ఇయాన్ మోర్గాన్​ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. గత కొంత కాలంగా ఫామ్​ కోల్పోయి ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడు. అతడి స్థానంలో వికెట్​ కీపర్​ జాస్​ బట్లర్​ బాధ్యతలు తీసుకోనున్నాడని సమాచారం.

Eoin morgan announces retirement
రిటైర్మెెంట్​ ప్రకటించిన వరల్డ్​కప్​ విన్నింగ్​ కెప్టెన్​

By

Published : Jun 28, 2022, 7:11 PM IST

Eoin Morgan retirement: అనుకున్నట్టే జరిగింది. టీమ్​ఇండియాతో వన్డే, టీ20 సిరీస్​కు ముందు ఇంగ్లాండ్ కెప్టెన్​ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. గతకొద్ది కాలంగా పేలవ ప్రదర్శన కనబరుస్తున్న పరిమిత ఓవర్ల కెప్టెన్​ ఇయాన్​ మోర్గాన్​ అంతర్జాతీయ క్రికెట్​కు రిటైర్మెంట్​ ప్రకటించాడు. గత 28 ఇన్నింగ్స్‌ల్లో అతడు రెండు అర్ధసెంచరీలు మాత్రమే చేశాడు.

మోర్గాన్‌ 2015లో కుక్‌ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్నాడు. అతడి సారథ్యంలో ఇంగ్లాండ్‌ బలమైన వన్డే, టీ20 జట్టుగా ఎదిగింది. 2019లో వన్డే ప్రపంచకప్‌ను కూడా గెలుచుకుంది. 35 ఏళ్ల మోర్గాన్‌ 126 వన్డేల్లో, 72 టీ20ల్లో ఇంగ్లాండ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అతడు 248 వన్డేల్లో 39.29 సగటుతో 7701 పరుగులు చేశాడు. 115 టీ20ల్లో 28.58 సగటుతో 2458 పరుగులు సాధించాడు. మోర్గాన్‌ 16 టెస్టుల్లో ఇంగ్లాండ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. చివరిసారి 2012లో టెస్టు మ్యాచ్‌ ఆడాడు. మోర్గాన్‌ స్థానంలో వైస్‌ కెప్టెన్‌ బట్లర్‌ ఇంగ్లాండ్‌ పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా నియమితుడయ్యే అవకాశముంది. మోర్గాన్‌ ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టును కూడా నడిపించాడు. కానీ బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమవుతుండడంతో గత సీజన్‌ తర్వాత కేకేఆర్‌ అతణ్ని వదులుకుంది. ఈ సీజన్‌కు ముందు వేలంలో అతణ్ని ఎవరూ కొనలేదు. అతడి ఐపీఎల్‌ కెరీర్‌ కూడా దాదాపు ముగిసినట్లే.

ఇదీ చూడండి: T20 Rankings: అదరగొట్టిన రాధా యాదవ్​.. స్మృతి, హర్మన్​ మళ్లీ అదే స్థానాల్లో

ABOUT THE AUTHOR

...view details