సెహ్వాగ్‌తో కన్నా సచిన్‌తో కలిసి తాను ఓపెనింగ్ చేయడాన్ని బాగా ఆస్వాదిస్తానని తెలిపాడు బీసీసీఐ మాజీ అధ్యక్షుడు గంగూలీ. తాను ఉత్తమ ఆటగాడిగా మెరుగుపడటానికి మాస్టర్ కారణమని చెప్పాడు. ఓ ఈవెంట్లో పాల్గొన్న అతడు కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలకు ఈ సమాధానాలు చెబుతూ ఈ విషయాన్ని తెలిపాడు.
సచిన్ చాలా మంచివాడు కానీ సెహ్వాగ్ కఠినమైన వ్యక్తి. నన్ను ఓ ఉత్తమమైన ఆటగాడిగా తీర్చిదిద్దాడు. అతడంటే నాకెంతో ప్రత్యేకం. చాలా దగ్గరిగా అతడిని చూశాను. ఓ సారి సచిన్‌కు పక్కటెముకల్లో గాయమైంది. కానీ అతడు సైలెంట్‌గానే ఉన్నాడు. కేవలం పరుగులపైనే దృష్టి పెట్టాడు. తర్వాత రోజు ఉదయాన్నే రిబ్స్‌లో ఫ్రాక్చర్ మరింత ఎక్కువైంది. అప్పటికీ 'నువ్వు బాగానే ఉన్నావా' అని నేను అతడిని అడిగాను. బాగానే ఉన్నాను అని సమాధానమిచ్చాడు. . ఏమీ జరగనట్టు కామ్‌గానే ఉన్నాడు తప్ప ఏమీ మాట్లాడలేదు. ఆటలో అతడికి ఉన్న నిబద్ధతకు ఇది నిదర్శనం. అందుకే అతడంటే నాకు ఎంతో ప్రత్యేకం. నాకు ఆదర్శంగా నిలిచాడు." అని దాదా పేర్కొన్నాడు.
ఇంకా ఇంగ్లాండ్ కన్నా ఆస్ట్రేలియాతోనే టెస్ట్ ఆడటం ఛాలెంజింగ్‌గా ఉంటుందని చెప్పాడు. బీసీసీఐ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తించడం కన్నా ఓ క్రికెటర్‌గా జాతీయ జట్టుతో కలిసి ఆటడమే తనకిష్టమని వెల్లడించాడు. అలాగే 2022 లార్డ్స్‌లో నాట్‌వెస్ట్ కప్ ఫైనల్లో గెలిచిన విజయం కన్నా 2001 స్వదేశంలో కోల్‌కతా టెస్ట్‌లో సాధించిన విజయమే ఎప్పటికీ తనకు ప్రత్యేకమని చెప్పాడు. ఆ గెలుపు జట్టులో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని పేర్కొన్నాడు.