యూకే వేదికగా జరగబోయే ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌పై ఆసీస్ బౌలర్ కమిన్స్ స్పందించాడు. ఇంగ్లాండ్‌లోని వాతావరణ పరిస్థితులు భారత్‌తో పోల్చితే కివీస్‌కే అనుకూలంగా ఉన్నాయని అభిప్రాయపడ్డాడు. కానీ, ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారనే విషయాన్ని మాత్రం చెప్పలేదు.
"డబ్ల్యూటీసీ ఫైనల్ గొప్ప మ్యాచ్ అవుతుంది. ఇంగ్లాండ్‌లో అధికంగా వర్షాలు కురుస్తున్నాయని నేను వార్తల్లో చూశాను. నాకు తెలిసి ఈ తరహా వాతావరణ పరిస్థితులు న్యూజిలాండ్‌కు అనుకూలంగా ఉంటాయి. గత రెండు నెలలుగా ఇరు జట్లు టెస్టు మ్యాచ్‌లు ఆడలేదు. కాబట్టి ఏదైనా జరగొచ్చు. నేను ఎవరికి మద్దతివ్వను. ఒకవేళ నేనేమైనా చెప్పాలనుకుంటే మాత్రం.. వాతావరణ పరిస్థితులు కివీస్‌కే అనుకూలంగా ఉన్నాయి."