ఇంగ్లాండ్తో వన్డే సిరీస్ ఆడుతున్న టీమ్ఇండియా మహిళ జట్టు నిరాశపరిచింది. భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇప్పటికే తొలి మ్యాచ్లో ఓటమిపాలైంది. దీంతో మరో మ్యాచ్ మిగిలుండగానే ఆతిధ్య ఇంగ్లీష్ జట్టు సిరీస్ను సొంతం చేసుకుంది.
టాస్ గెలిచిన ఇంగ్లాండ్.. భారత్కు బ్యాటింగ్ అప్పగించింది. దీంతో నిర్ణీత 50 ఓవర్లు ఆడిన మన మహిళా జట్టు 221 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ మిథాలీరాజ్ (59), షెఫాలీ వర్మ(44) మినహా అందరూ విఫలమయ్యారు.