భారత్తో రెండో టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. కోహ్లీ సేన బ్యాటింగ్ చేయనుంది. అంతకుముందు చిరుజల్లులు కురవడం వల్ల మ్యాచ్ టాస్ కాస్త ఆలస్యం అయింది. భారత కాలమానం ప్రకారం 3:45 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
భారత్లో శార్దూల్ ఠాకుర్, ఇంగ్లాండ్లో బ్రాడ్.. గాయాల కారణంగా మ్యాచ్కు దూరమయ్యారు.
శార్దూల్ స్థానంలో ఇషాంత్ శర్మ తుది జట్టులోకి వచ్చాడు. ఇంగ్లాండ్ మూడు మార్పులతో బరిలోకి దిగుతోంది.
తొలి టెస్టులో భారత్ విజయం దిశగా సాగుతున్న తరుణంలో.. వర్షం అంతరాయం కలిగించింది. చివరి రోజు ఆట సాధ్యం కాకపోవడం వల్ల మ్యాచ్ డ్రాగా ముగిసింది. రెండు జట్లకు చెరో నాలుగు పాయింట్ల చొప్పున లభించాయి. అయితే.. స్లో ఓవర్ రేటు కారణంగా.. రెండు జట్లకు రెండు పాయింట్ల చొప్పున కోత విధించింది ఐసీసీ.