భారత్‌తో తొలి టెస్టులో ఇంగ్లాండ్ తడబడింది. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 183 పరుగులకే ఆలౌటైంది. టీమ్ఇండియా బౌలర్లలో బుమ్రా 4, షమి 3, శార్దుల్ ఠాకుర్ 2, సిరాజ్ ఓ వికెట్ పడగొట్టారు. 64 పరుగులు చేసిన కెప్టెన్ జో రూట్ ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్.
Ind vs Eng: భారత బౌలర్లు అదుర్స్.. ఇంగ్లాండ్ ఆలౌట్ - ఇండియా vs ఇంగ్లాండ్ లైవ్
భారత బౌలర్లు అదరగొట్టారు. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ను తక్కువ పరుగులకే కట్టడి చేశారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన రూట్సేనను కేవలం 183 పరుగులకే ఆలౌట్ చేశారు.
ఇండియా vs ఇంగ్లాండ్
ఇంగ్లాండ్ టపటపా..
138/4తో టీ విరామానికి వెళ్లిన ఇంగ్లాండ్.. మరో 45 పరుగులకు చివరి ఆరు వికెట్లను కోల్పోయింది. చివరి సెషన్లో క్రమం తప్పకుండా బ్యాట్స్‌మెన్ ఔటయ్యారు. టీ విరామం తర్వాత అదే స్కోరు వద్ద లారెన్స్ వికెట్‌ను కోల్పోయింది. మరో ఏడు పరుగులకు బట్లర్ పెవిలియన్ చేరాడు. ఆ వెంటనే రూట్ కూడా వెనుదిరిగాడు. ఆఖర్లో క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్.. ఆలౌట్ కావడానికి ఎంతో సమయం పట్టలేదు.
Last Updated : Aug 4, 2021, 10:02 PM IST