వ్యాఖ్యాతగా మారిన టీమ్ఇండియా సీనియర్ బ్యాట్స్మన్ దినేశ్ కార్తీక్(Dinesh Karthik) వివాదంలో చిక్కుకున్నాడు. ఇటీవలే వ్యాఖ్యాతగా కెరీర్ ఆరంభించి.. న్యూజిలాండ్, టీమ్ఇండియా మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో(WTC Final) తన వాక్చాతుర్యంతో ఆకట్టుకున్న అతను.. ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు. ఇంగ్లాండ్, శ్రీలంక (England vs Sri Lanka)తో గురువారం ముగిసిన రెండో వన్డే సందర్భంగా వ్యాఖ్యాతగా ఉన్న అతను.. మహిళల గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడమే అందుకు కారణం.
మహిళలపై కార్తీక్ అనుచిత వ్యాఖ్యలు.. క్షమాపణకు డిమాండ్
ఇటీవలే వ్యాఖ్యాతగా మారిన టీమ్ఇండియా సీనియర్ బ్యాట్స్మన్ దినేశ్ కార్తీక్(Dinesh Karthik).. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డాడు. ఇంగ్లాండ్, శ్రీలంక(England vs Sri Lanka) మధ్య గురువారం జరిగిన రెండో వన్డేకు కార్తీక్ వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. క్రికెట్ బ్యాట్లు పరాయి పురుషుల భార్యల్లాంటివని పేర్కొన్నాడు.
"బ్యాట్స్మెన్, బ్యాట్లను ఇష్టపడకపోవడమనేవి రెండు వేర్వేరు విషయాలు కావు. చాలామంది బ్యాట్స్మెన్ తమ బ్యాట్లను ఇష్టపడ్డట్లు కనిపించరు. వాళ్లు ఇతర ఆటగాళ్ల బ్యాట్లను ఇష్టపడతారు. బ్యాట్లనేవి చుట్టుపక్కల ఉండే పరాయి పురుషుల భార్యల్లాంటివి. అవెప్పుడూ సౌకర్యవంతంగా ఉంటాయి" అని దినేశ్ వ్యాఖ్యానించాడు. దీంతో అతనిపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చెలరేగుతున్నాయి. బ్యాట్లను పరాయి పురుషుల భార్యలతో పోల్చి చూడడాన్ని నెటిజన్లు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు అతను క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చదవండి:India vs Srilanka: ప్రాక్టీస్ మొదలుపెట్టిన గబ్బర్సేన