న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ నయా రికార్డు నెలకొల్పాడు. కివీస్ జట్టు తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్గా రికార్డు నమోదు చేశాడు. రాస్ టేలర్ పేరు మీదున్న రికార్డును బద్దలుగొట్టి ప్రథమ స్థానానికి ఎగబాగాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో భాగంగా ఈ రికార్డు నమోదు చేశాడు కేన్ విలియమ్సన్. 92 టెస్టులు ఆడిన విలియమ్సన్ 53.33 సగటుతో 7787 పరుగులు చేశాడు. రాస్ టేలర్ 112 టెస్టుల్లో 7683 పరుగులు చేశాడు. కాగా, తన రికార్డును బద్దలుగొట్టిన విలయమ్సన్కు రాస్ టేలర్ అభినందనలు తెలిపాడు.
ప్రస్తుతం ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ ఆడుతోంది కివీస్. మొదటి బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 8 వికెట్ల నష్టానికి 435 పరుగులు చేసి డిక్లేర్ ఇచ్చేసింది. దీంతో బ్యాటింగ్కు దిగిన కివీస్ 209 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ ఫాలో ఆన్ ఆడింది. ఈ ఇన్నింగ్స్‌లో కివీస్ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేశారు. విలియమ్సన్‌తో పాటు వికెట్ కీపర్ బ్లండెల్(90) రాణించాడు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 483 పరుగులకు ఆలౌటైంది. ఇక ఈ ఇన్నింగ్స్‌లో విలియమ్సన్(132) పరుగులతో చెలరేగిపోయాడు.
విలియమ్సన్ రికార్డుల మోత..
విలియమ్సన్తాజాగా చేసిన సెంచరీతో తన టెస్టు కెరీర్లో 26 శతకాన్ని నమోదు చేశాడు కేన్ విలియమ్సన్. ఇదే కాకుండా న్యూజిలాండ్ తరఫున 20కి పైగా సెంచరీలు సాధించిన ప్లేయర్గా చరిత్ర సృష్టించాడు. కేన్ తర్వాతి స్థానంలో 19 శతకాలతో రాస్ టేలర్ ఉన్నాడు. విలియమ్సన్ ఇప్పటివరకు టెస్టుల్లో 3,930 పరుగులు చేశాడు. ఇక తమ దేశం తరఫున కనీసం 20 టెస్టుల్లో ఆడి.. అందులో అత్యధిక సగటుతో అత్యధిక పరుగులు, సెంచరీలు, 50 ప్లస్ స్కోరు, డబులు సెంచరీలు చేసిన ఇద్దరు ప్లేయర్లలో విలియమ్సన్ ఒకరు. మరోవైపు.. శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర కూడా తన దేశం తరఫున ఈ రికార్డులన్నీ నమోదు చేశాడు. విలియమ్సన్ ఇప్పటివరకు 9 దేశాలతో టెస్టు మ్యాచ్లు ఆడాడు. ఆడిన ప్రతి దేశంతో ఒకటి, అంతకంటే ఎక్కువ సెంచరీలు బాది పూర్తి చేసి రికార్డు నమోదు చేశాడు.