లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ మెరుగైన ప్రదర్శన చేస్తోంది. టీ సమయానికి 2 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. ఓపెనింగ్ జోడీ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ శతక భాగస్వామ్యం నమోదు చేసింది. హాఫ్‌సెంచరీలు చేసిన వీరిద్దరూ తొలి వికెట్‌కు 126 పరుగులు జోడించారు.
హిట్‌మ్యాన్ 83 పరుగులు చేసి వెనుదిరిగాడు. అందులో 11 ఫోర్లు, ఓ సిక్స్ ఉన్నాయి. మొదట ఆచితూచి ఆడిన రోహిత్ శర్మ.. తర్వాత దూకుడు పెంచాడు. కచ్చితంగా సెంచరీ చేస్తాడన్నట్లే కనిపించినప్పటికీ.. అండర్సన్ వేసిన చక్కటి ఇన్‌స్వింగర్‌కు బౌల్డయ్యాడు.
మరోవైపు.. రాహుల్ ఇంగ్లాండ్ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. 100 బంతుల వరకు ఒక్క బౌండరీ కొట్టకపోవడం గమనార్హం. తాను ఎదుర్కొన్న 108వ బంతిని స్టాండ్స్‌లోకి తరలించి బౌండరీల ఖాతా తెరిచాడు. 137 బంతుల్లో అర్ధసెంచరీ మార్కును అందుకున్నాడు.
పుజారా మరోసారి నిరాశపర్చాడు. 9 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం రాహుల్(55), కెప్టెన్ విరాట్ కోహ్లీ(0) పరుగులతో క్రీజులో ఉన్నారు.
ఇంగ్లాండ్ బౌలర్లలో అండర్సన్ మాత్రమే వికెట్ తీశాడు.
ఇదీ చూడండి:'అవును.. ప్రపంచ అత్యుత్తమ ఫీల్డర్లలో నేనూ ఒకడిని!'