తెలంగాణ

telangana

ETV Bharat / sports

IND Vs ENG 5th Test: 'మ్యాచ్​ రద్దుకు కరోనా కారణం కాదు' - Corona In Indian Team

భారత్‌-ఇంగ్లాండ్‌ జట్ల మ‌ధ్య జ‌ర‌గాల్సిన ఐదో టెస్టు(IND Vs ENG 5th Test) నాటకీయ పరిణామాల మధ్య కొన్ని గంటల ముందు రద్దు అయ్యింది. ఇప్పుడా మ్యాచ్​ను రీషెడ్యూల్​ చేయాలని ఇరు దేశాల క్రికెట్​ బోర్డులు నిర్ణయించాయి. ఈ సిరీస్​ ఫలితంపై ఐసీసీ(ICC News) ఎలాంటి ప్రకటన విడుదల చేయని నేపథ్యంలో.. ఇంగ్లాండ్​ క్రికెట్​ బోర్డు సీఈఓ టామ్ హారిసన్​(ECB CEO) చేసిన ఓ ప్రకటన ఇప్పుడు చర్చనీయాంశమైంది.

Wasn't outbreak of COVID, it was perception of what might happen that caused cancellation: ECB CEO
IND Vs ENG 5th Test: 'మ్యాచ్​ రద్దుకు కరోనా కారణం కాదు'

By

Published : Sep 10, 2021, 7:17 PM IST

భారత్​-ఇంగ్లాండ్​(India Vs England) మధ్య ఐదో టెస్టు రద్దుకు కరోనా కారణంగా కాదని అంటున్నాడు ఇంగ్లాండ్​ క్రికెట్​ బోర్డు సీఈఓ టామ్​ హారిసన్​(ECB CEO). భారత ఆటగాళ్ల సౌకర్యం కోసమే ఆఖరి మ్యాచ్​ను ఆపేందుకు నిర్ణయించినట్లు ఆయన తెలిపాడు. భారత ఫిజియోకు గురువారం కరోనా సోకిన తర్వాత.. శుక్రవారం మ్యాచ్​ ఆడేందుకు మైదానంలోకి వచ్చేందుకు టీమ్ఇండియా(Corona In Indian Team) సాహసించలేదని అన్నాడు. అయితే భారత జట్టును ఆడించేందుకు తాము శతవిధాల ప్రయత్నించామని వెల్లడించాడు.

"ఈ రోజు చాలా విచారకరమైనది. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది క్రికెట్​ అభిమానులు ఎదురుచూస్తున్న మ్యాచ్​ ఆగిపోవడం మమ్మల్ని చాలా బాధించింది. గురువారం భోజన సమయానికి భారత శిబిరంలో ఆందోళనకరమైన పరిస్థితి ఏర్పడిందని తెలిసింది. అయితే దానికి కరోనా కారణం కాదు. ఫిజియోకు కరోనా సోకడం వల్ల అదే అసలైన కారణమని అందరూ భావించారు. అయినా ఐదో టెస్టు ఆడేందుకు ఆటగాళ్లను సంప్రదించినా.. క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో వారు ఆడలేకపోయారు".

- టామ్​ హారిసన్​, ఈసీబీ సీఈఓ

ఐదు మ్యాచ్​ల టెస్టు సిరీస్‌ ఫలితంపై(IND VS ENG Test Series) ఐసీసీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ నేపథ్యంలో సిరీస్​పై ఇంగ్లాండ్​ క్రికెట్​ బోర్డు ఓ స్పష్టత ఇచ్చింది. భవిష్యత్​లో ఐదో టెస్టు రీషెడ్యూల్​ అయినా.. దానికి సిరీస్​కు సంబంధం ఉండదని ఈసీబీ సీఈఓ టామ్​ హారిసన్​ అన్నాడు. ఇదే జరిగితే సిరీస్​లో 2-1తో ఆధిక్యంలో ఉన్న టీమ్ఇండియా విజేతగా నిలుస్తుందని విశ్లేషకులు అంటున్నారు.

ఇదీ చూడండి..IND Vs ENG: నిమిషాల వ్యవధిలో మాట మార్చిన ఇంగ్లాండ్​ బోర్డు!

ABOUT THE AUTHOR

...view details