తెలంగాణ

telangana

ETV Bharat / sports

'టెస్టుల్లో బెయిర్​స్టోకు రోజులు దగ్గరపడ్డాయి'​ - ఇండియా vs ఇంగ్లాండ్​ టెస్టు సిరీస్​

టీమ్ఇండియాతో జరిగిన టెస్టు సిరీస్​లో ఇంగ్లాండ్​ బ్యాట్స్​మన్​ బెయిర్​స్టో బ్యాటింగ్ చేసినట్లు తనకు కనిపించలేదని ఎద్దేవా చేశాడు ఆ దేశ మాజీ కెప్టెన్​ మైకేల్​ వాన్​. గత కొన్ని పర్యటనలలో బెయిర్​స్టో ప్రదర్శనను దృష్టిలో ఉంచుకుని రాబోయే యాషెస్​ సిరీస్​కు అతడికి జట్టులో అవకాశం దక్కకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డాడు.

Vaughan feels Bairstow's days are numbered in England team
'టెస్టు క్రికెట్​లో బెయిర్​స్టోకు రోజులు దగ్గరపడ్డాయి'​

By

Published : Mar 7, 2021, 7:22 PM IST

టెస్టు క్రికెట్​లో ఇంగ్లాండ్​ బ్యాట్స్​మన్ బెయిర్​స్టోకు రోజులు తగ్గిపోతున్నాయని ఆ జట్టు మాజీ కెప్టెన్​ మైకేల్ వాన్​ అభిప్రాయపడ్డాడు. టీమ్ఇండియాతో జరిగిన టెస్టు సిరీస్​లో తన పేలవ ప్రదర్శన కారణంగా రాబోయే యాషెస్​ సిరీస్​లోనూ బెయిర్​స్టోకు అవకాశం దక్కకపోవచ్చని అన్నాడు.

"జానీ బెయిర్​స్టో ఈ టెస్టు సిరీస్​లో లేడు. ఆస్ట్రేలియాతో పాటు ఇతర జట్లపై ఆడిన మ్యాచ్​ల్లో అతడి బ్యాటింగ్​ ఆడడం నేను చూడలేదు. ఈ విధంగా చూస్తే రాబోయే యాషెస్​ సిరీస్​ తుదిజట్టులో అడే అవకాశం అతడికి దక్కకపోవచ్చు. కెప్టెన్ జో రూట్​, పేసర్​ జేమ్స్ అండర్సన్​, ఆల్​రౌండర్​ బెన్​ స్టోక్స్​ మాత్రమే అత్యున్నత ప్రదర్శన కనబర్చారు. స్పిన్నర్​ జాక్​ లీచ్​ ఈ పర్యటనతో తన ఖ్యాతి కొద్దిగా పెంపొందించుకున్నాడు".

- మైకేల్​ వాన్​, ఇంగ్లాండ్​ మాజీ కెప్టెన్​

ఇంగ్లాండ్​ బ్యాట్స్​మన్ బెయిర్​స్టో.. టీమ్ఇండియాతో ఆడిన నాలుగో టెస్టు మొదటి ఇన్నింగ్స్​లో 28 పరుగులే తప్ప, మిగిలిన ఇన్నింగ్స్​లో అసలు పరుగుల ఖాతానే తెరవకపోవడం గమనార్హం.

ఇంగ్లాండ్​ జట్టు పరిమిత ఓవర్లపైనే కాకుండా టెస్టు క్రికెట్​పై కూడా ఎక్కువ దృష్టి పెట్టాలని మైకేల్​ వాన్​ అన్నాడు. "టీమ్ఇండియాతో జరిగిన టెస్టు సిరీస్​లో ఇంగ్లాండ్​ జట్టు ఓడిపోయింది. ఇప్పటికైనా ఆ జట్టు వైట్​-బాల్​ మ్యాచ్​లపైనే కాకుండా టెస్టు క్రికెట్​పై కూడా దృష్టి సారించాలి. టీమ్ఇండియా గెలిచిన మూడు టెస్టుల్లోనూ ఇంగ్లాండ్​కు అనుకూలించే పరిణామాలు జరగలేదు. ఈ మ్యాచ్​ల్లో భారత్​ కొంత సమయంలోనే ఆధిక్యాన్ని పుంజుకోగలిగింది" అని వాన్​ తెలిపాడు.

ఇదీ చూడండి:పంత్​ను ఎవరితోనూ పోల్చలేను: రవిశాస్త్రి

ABOUT THE AUTHOR

...view details