తెలంగాణ

telangana

ETV Bharat / sports

'అప్పుడే ఆట అయిపోలేదు.. ఇప్పటికైనా గెలుస్తాం' - స్టార్ గేజింగ్

ఇంగ్లాండ్​పై టెస్టు సిరీస్​ గెలిచేందుకు భారత జట్టుకు ఇంకా అవకాశాలున్నాయని కోచ్​ రవిశాస్త్రి(Ravi Shastri) తెలిపాడు. అతడి కొత్త పుస్తకం 'స్టార్ గేజింగ్' ప్రమోషన్ కార్యక్రమంలో శాస్త్రి మీడియాతో మాట్లాడాడు.

ravi shasthri
రవిశాస్త్రి

By

Published : Sep 2, 2021, 12:12 PM IST

ఇంగ్లాండ్‌పై సిరీస్ గెలిచేందుకు టీమ్‌ఇండియాకు ఇంకా అవకాశాలు ఉన్నాయని కోచ్‌ రవిశాస్త్రి(Ravi Shastri) అంటున్నాడు. మూడో టెస్టు పరాజయాన్ని మర్చిపోవాలని సూచించాడు. లార్డ్స్‌ టెస్టు అద్భుతాన్ని ప్రేరణగా తీసుకోవాలని వెల్లడించాడు. అతడి కొత్త పుస్తకం 'స్టార్‌ గేజింగ్‌' ప్రమోషన్‌ కార్యక్రమంలో శాస్త్రి మీడియాతో మాట్లాడాడు.

"ఇదెంతో తేలిక. లార్డ్స్‌ నుంచి మళ్లీ మొదలు పెట్టాలి. ఆ విజయాన్ని గుర్తుపెట్టుకొని మూడో టెస్టు పరాజయం మర్చిపోవాలి. చెప్పడం కన్నా చేయడం కష్టమని నాకు తెలుసు. కానీ, మనం మంచి సందర్భాలను నెమరు వేసుకోవాలి. ఓటములు ఆటలో సహజమే కదా."

-రవిశాస్త్రి, టీమ్ఇండియా కోచ్.

ఆటకు ముందు సానుకూలంగా ఆలోచించాలని శాస్త్రి తెలిపాడు. లార్డ్స్‌ టెస్టులో(Lords Test 2021) టీమ్‌ఇండియా ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఐదో రోజు అద్భుతం చేసిన సంగతిని గుర్తుచేశాడు. "నిజానికి రెండో టెస్టులో ఇంగ్లాండ్‌ ఆధిపత్యం చెలాయిస్తోంది. కానీ, కోహ్లీసేన విజయం లాగేసుకుంది. ఇక చివరి టెస్టులో ఇంగ్లాండ్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసింది. తొలిరోజే మాపై ఆధిపత్యం ప్రదర్శించింది. మమ్మల్ని వెనకడుగు వేసేలా చేసింది" అని ఆయన వెల్లడించాడు.

మూడో టెస్టు(Ind vs Eng 3rd test 2021) తొలి ఇన్నింగ్స్‌లో 78 పరుగులకే ఆలౌటైనా రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా బాగానే పుంజుకుందని శాస్త్రి అన్నాడు. "నిజానికి మేం రెండో ఇన్నింగ్స్‌లో పోరాడాం. తొలి ఇన్నింగ్స్‌లో 78 పరుగులకే ఆలౌటయ్యాం. కానీ, ఈ సిరీసులో ఇప్పటికీ అవకాశాలు ఉన్నాయి" అని పేర్కొన్నాడు.

ఎవరైనా ఈ భారత జట్టును తక్కువ అంచనా వేస్తే అంతే సంగతులని రవిశాస్త్రి వెల్లడించాడు. సిరీసు 1-1తో సమమైనా సొంతగడ్డపై ఆడుతున్నప్పుడు ఆతిథ్య జట్టుపైనే ఒత్తిడి ఎక్కువగా ఉంటుందన్నాడు. "సొంతగడ్డపై గెలవాలన్న తపన ఇంగ్లాండ్‌కు ఉంటుంది. ఎందుకంటే భారత్‌లో మేమదే చేశాం. బంతి ఇప్పుడు వారి కోర్టులో ఉంది. సిరీస్‌ కోసం వారు పోరాడరని చెప్పడంలో సందేహం లేదు" అని శాస్త్రి తెలిపాడు.

ఇదీ చదవండి:INDvsENG 4th Test: గెలుపే లక్ష్యంగా రెండు జట్లు!

ABOUT THE AUTHOR

...view details