తెలంగాణ

telangana

ETV Bharat / sports

Ind vs Eng Test: లంచ్​ సమయానికి టీమ్​ ఇండియా 97/1 - టీమ్​ఇండియా లంచ్​ బ్రేక్​ స్కోరు

ఇంగ్లాండ్​తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్​కు మంచి శుభారంభం దక్కింది.​ ఓపెనర్లు నిలకడగా ఆడారు. లంచ్​కు ముందు రోహిత్​ శర్మ(36) ఔటయ్యాడు. లంచ్​ సమయానికి ఇండియా వికెట్​ నష్టానికి 97 పరుగులతో ఉంది.

teamindia
టీమ్​ఇండియా

By

Published : Aug 5, 2021, 5:45 PM IST

Updated : Aug 5, 2021, 7:07 PM IST

ఇంగ్లాండ్​తో తొలి టెస్టులో టీమ్‌ఇండియా రెండో రోజు భోజన విరామ సమయానికి వికెట్​ కోల్పోయి 97 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కేఎల్​ రాహుల్(48) ఉన్నాడు. 21/0 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో బరిలోకి దిగిన టీమ్ఇండియాకు మంచి శుభారంభం దక్కింది. ఓపెనర్లు రోహిత్​(36), రాహుల్​ నిలకడగా ఆడారు. తొలి వికెట్​కు 97 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. సామ్​ కరన్​ బౌలింగ్​లో రోహిత్​ వెనుదిరిగిన వెంటనే భోజన విరామం ప్రకటించారు. ​

టీమ్​ఇండియాకు మంచి శుభారంభం అందించిన రోహిత్​, కేఎల్​ రాహుల్​
రోహిత్​ వికెట్​ తీసిన సందర్భంగా సహ క్రికెటర్లతో ఆనందాన్ని పంచుకుంటున్న ఇంగ్లాండ్​ బౌలర్​ రాబిన్సన్​

అంతకుముందు మొదటిరోజు ఆటలో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 183 పరుగులకు ఆలౌటైంది. బుమ్రా(4/46) షమి(3/28 ), శార్దూల్​(2/41), సిరాజ్​(1/48) ప్రత్యర్థులను చిత్తు చేశారు. ఇంగ్లాండ్​ జట్టులో కెప్టెన్​ జో రూట్​(64) ఒక్కడే రాణించాడు. అనంతరం బ్యాటింగ్​కు దిగిన టీమ్​ఇండియా 13 ఓవర్లు ఆడి 21/0 తొలి రోజు ఆటను ముగించింది.

దూకుడుగా ఆడిన ఇంగ్లాండ్​ కెప్టెన్​ జో రూట్​.. శార్దూల్​ ఠాకుర్​ బౌలింగ్​లో ఎల్​బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఈ సందర్భంగా ఠాకుర్​తో ఆనందాన్ని పంచుకుంటున్న సారథి కోహ్లీ, రోహిత్​ శర్మ, కేఎల్​ రాహుల్​
స్టువర్ట్​ బ్రాడ్​ వికెట్​ తీసిన ఆనందంలో మైదానంలో పరిగెడుతున్న బుమ్రా

ఇదీ చూడండి: బుమ్రా, రూట్ రికార్డులు​.. టీ బ్రేక్​కు ఇంగ్లాండ్ స్కోరు 138/4​

Last Updated : Aug 5, 2021, 7:07 PM IST

ABOUT THE AUTHOR

...view details