అహ్మదాబాద్ వేదికగా ఫిబ్రవరి 24 నుంచి ఇంగ్లాండ్, భారత్ మధ్య మూడో టెస్టు ప్రారంభం కానుంది. ఈ టెస్టు కోసం టీమ్ఇండియా ఆటగాళ్లు జిమ్‌లో తీవ్రంగా కసరత్తులు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను 'స్థిరత్వం కీలకమైనది' అనే క్యాప్షన్‌తో పంచుకున్నాడు సారథి విరాట్ కోహ్లీ. మిగిలిన క్రికెటర్లు తమ తమ పిక్స్‌ను సోషల్‌మీడియాలో షేర్ చేశారు.
జిమ్‌లో సరదాగా..
టీమ్‌ఇండియా యువ బ్యాట్స్‌మన్, వికెట్ కీపర్ రిషభ్‌పంత్ మరోసారి స్పైడర్‌మ్యాన్‌గా వార్తల్లో నిలిచాడు. ఇంగ్లాండ్‌తో మూడో టెస్టుకు ముందు మొతేరా స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్న సందర్భంగా అతడు స్పైడర్‌మ్యాన్‌లా మారిపోయాడు. మిగతా ఆటగాళ్లు జిమ్‌లో శారీరక కసరత్తులు చేస్తుంటే పంత్ నేలపై పాకుతూ వెళ్లాడు. అందుకు సంబంధించిన వీడియోను ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకున్నాడు. ఆ వీడియోకు స్పైడర్ మ్యాన్ థీమ్‌సాంగ్‌ను బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌గా సెట్‌చేశారు.