ఇంగ్లాండ్తో జరిగిన రెండో టీ20లో స్లోఓవర్ రేటు కారణంగా.. టీమ్ఇండియాకు 20 శాతం మ్యాచ్ ఫీజు కోత విధించారు. ఈ మ్యాచ్లో ఒక ఓవర్ స్లోరేటు అవ్వడం వల్ల కోహ్లీ సారథ్యంలోని భారత జట్టుకు జరిమానా విధిస్తున్నట్లు ఐసీసీ ఇలైట్ ప్యానెల్ ఆఫ్ మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్ వెల్లడించారు.
"ఐసీసీ రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 2.22 ప్రకారం.. కేటాయించిన సమయంలో కనీస ఓవర్ రేటును అందుకోవడంలో క్రికెటర్లు విఫలమైతే వారి మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధిస్తారు. మ్యాచ్ ఫీజులో కోతకు టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అంగీకరించాడు. దీంతో ప్రాథమిక విచారణ అవసరం లేదు" అని ఐసీసీ సోమవారం ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.