తెలంగాణ

telangana

ETV Bharat / sports

పీకల్లోతు కష్టాల్లో ఇంగ్లాండ్- టీ విరామానికి ​106/8 - chidambaram stadium

చెన్నై టెస్టులో ఇంగ్లాండ్​ ఎదురీదుతోంది. టీ విరామ సమయానికి ఆ జట్టు 8 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అశ్విన్​ 4 వికెట్లు తీసుకున్నాడు.

tea time in second test
పీకల్లోతు కష్టాల్లో ఇంగ్లాండ్- టీ విరామానికి ​106/8

By

Published : Feb 14, 2021, 2:16 PM IST

చెపాక్​ వేదికగా భారత్​తో జరుగుతోన్న రెండో టెస్టులో ఇంగ్లాండ్​ పీకల్లోతు కష్టాల్లో పడింది. తొలి ఇన్నింగ్స్​లో టీ విరామ సమయానికి ఆ జట్టు 8 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. క్రీజులో బెన్​ ఫోక్స్​(23) ఉన్నాడు. టీమ్​ఇండియా బౌలర్లలో అశ్విన్​ నాలుగు, అక్షర్​ రెండు వికెట్లు తీశారు.

మొదటి సెషన్​లో నాలుగు వికెట్లు కోల్పోయిన రూట్​ సేన.. టీ ముందు మరో నాలుగు వికెట్లు కోల్పోయింది. ఒకానొక దశలో 52 పరుగులకే సగం టీమ్​ పెవిలియన్​ చేరింది. ఫోక్స్​తో కలిసి పోప్ ఇన్నింగ్స్​ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఈ జంట 35 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని సిరాజ్​ విడగొట్టాడు. 38వ ఓవర్లో బంతి అందుకున్న ఈ హైదరాబాదీ పేసర్​.. తొలి బంతికే పోప్​ను పెవిలియన్​కు పంపాడు.

ఫోక్స్​కు సహకారమిస్తున్న మొయిన్​ అలీని అక్షర్​ పటేల్​ ఔట్​ చేశాడు. అక్షర్​ వేసిన బంతిని అలీ కట్ చేయగా కీపర్​ రిషభ్​పంత్ కాలుకు తాకి గాల్లోకి లేచింది. స్లిప్స్​లో ఉన్న రహానె అద్భుతంగా డైవ్​ చేసి క్యాచ్​ అందుకున్నాడు.

ఇదీ చదవండి:రెండో టెస్టులో గెలుపుపై డీకే జోస్యం

ABOUT THE AUTHOR

...view details