ఇంగ్లాండ్‌తో చివరి రెండు టెస్టుల్లో తలపడే భారత జట్టులో ఫాస్ట్‌బౌలర్ ఉమేశ్ యాదవ్‌ను చేర్చారు. ఆస్ట్రేలియాలో మెల్బోర్న్ టెస్టు సందర్భంగా గాయపడిన ఉమేశ్‌కు సోమవారం ఫిట్నెస్ పరీక్ష నిర్వహించారు. అందులో అతడు నెగ్గాడని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది.
ఫిట్నెస్ టెస్ట్ పాస్.. పింక్-టెస్టుకు ఉమేశ్!
అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరగనున్న మిగిలిన రెండు టెస్టుల్లో ఫాస్ట్‌బౌలర్ ఉమేశ్ యాదవ్‌కు చోటుదక్కింది. సోమవారం బీసీసీఐ నిర్వహించిన ఫిట్నెస్ పరీక్షలో ఉమేశ్ నెగ్గడం వల్ల ఇంగ్లాండ్‌తో ఆడనున్న టెస్టు జట్టులోకి అతడిని చేర్చారు.
ఫిట్నెస్ టెస్ట్ పాస్.. గులాబి టెస్టుకు ఉమేశ్
విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొనేందుకు వీలుగా శార్దూల్ ఠాకూర్‌ను జట్టు నుంచి విడుదల చేసినట్లు చెప్పింది. ఠాకూర్ ముంబయికి ప్రాతినిధ్యం వహించనున్నాడు. మూడో టెస్టులో భారత్ ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగే అవకాశమున్న నేపథ్యంలో ఉమేశ్ ఆ మ్యాచ్‌లో ఆడే అవకాశముంది.
ఇదీ చూడండి:ఆ రికార్డుకు సమయం పడుతుంది!: ఇషాంత్
Last Updated : Feb 23, 2021, 7:28 AM IST