అహ్మదాబాద్‌లో అధిక ఉష్ణోగ్రత కారణంగా ఇంగ్లాండ్ ఆటగాళ్లు అతిసారవ్యాధికి గురయ్యారు. ఈ విషయాన్ని ఆ జట్టు కెప్టెన్ జో రూట్ స్పష్టం చేశాడు. కానీ, తమ ఆటగాళ్లందరూ నాలుగో టెస్టుకు సిద్ధంగా ఉన్నారని తెలిపాడు. అయితే, ఎవరు అనారోగ్యానికి గురయ్యారనే వివరాలను మాత్రం వివరించలేదు.
ఇంగ్లాండ్ క్రికెటర్లకు డయేరియా.. కానీ! - ఇండియా Vs ఇంగ్లాండ్
టీమ్ఇండియాతో ఆఖరి టెస్టుకు ముందు ఇంగ్లాండ్ ఆటగాళ్లు అతిసారవ్యాధికి గురయ్యారు. అహ్మదాబాద్‌లో అధిక ఉష్ణోగ్రత కారణంగా క్రికెటర్ల డయేరియాతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే నాలుగో టెస్టుకు తమ ఆటగాళ్లందరూ అందుబాటులో ఉంటారని ఆ టీమ్ కెప్టెన్ జో రూట్ స్పష్టం చేశాడు.
ఇంగ్లాండ్ టీమ్‌లోని కొంతమంది ఆటగాళ్లతో పాటు సహాయక కోచ్ పాల్ కాలింగ్‌వుడ్ డయేరియాతో బాధపడుతున్నట్లు సమాచారం. భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతోన్న నాలుగు మ్యాచ్‌లు టెస్టు సిరీస్‌లో 2-1తో టీమ్ఇండియా ఆధిక్యంలో ఉంది. అయితే చివరి టెస్టులోనూ నెగ్గి.. టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో అడుగుపెట్టాలని కోహ్లీసేన సంసిద్ధమవుతోంది. మరోవైపు ఆఖరి టెస్టులో గెలిచి సిరీస్‌ను డ్రాగా ముగించాలని ఇంగ్లాండ్ జట్టు ప్రణాళికలను రచిస్తోంది.
ఇదీ చూడండి:సర్జరీ తర్వాత ప్రాక్టీస్ మొదలుపెట్టిన జడేజా