మొతేరా పిచ్‌పై పరుగులు ఎలా చేయాలో టీమ్ఇండియా ఓపెనర్ రోహిత్‌శర్మ చూపించాడని సునీల్ గావస్కర్ అన్నారు. టెస్టు బ్యాట్స్‌మెన్ అన్నప్పుడు బంతి టర్నైనా, ఎదురుగా వచ్చినా ఆడాల్సిందేనని స్పష్టం చేశారు. డే/నైట్ టెస్టులో బంతి మరీ విపరీతంగా ఏమీ టర్నవ్వలేదని పేర్కొన్నారు. అక్షర్ పటేల్, అశ్విన్ బౌలింగ్ అద్భుతమని ప్రశంసించారు.
"పిచ్‌పై విసిరిన ప్రతి బంతీ విపరీతంగా స్పందించలేదు. ప్రమాదకరంగానూ అనిపించలేదు. ఊహించలేనంత బౌన్స్ కనిపించలేదు. నిజానికి ఇక్కడ ఉండాల్సిన స్థాయిలోనే బౌన్స్ ఉంది. బంతి మాత్రం కొద్దిగా స్పిన్ అయ్యింది. కానీ టెస్టు బ్యాట్స్‌మన్ అన్నప్పుడు బంతి టర్న్ అయినా నేరుగా వచ్చినా ఆడాల్సిందే. ఇది సవాలే కానీ, మరీ ఆడలేనంత కాదు. బ్యాట్స్‌మెన్ ఔటైన విధానం చూస్తుంటే వారి గోతులు వారే తవ్వుకున్నట్టు ఉంది. పిచ్ కన్నా బ్యాట్స్‌మెన్ వైఖరే ఎక్కువగా దెబ్బతీసింది. మొతేరా పిచ్‌పై పరుగులు ఎలా చేయాలో రోహిత్ శర్మ రెండు ఇన్నింగ్సుల్లోనూ తన బ్యాటింగ్ ద్వారా చూపించాడు"