ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టు(Ind Eng Test) ముందు టీమ్ఇండియా అభిమానులకు చేదు వార్త! మూడో టెస్టు రెండో రోజున ఫీల్డింగ్ చేస్తుండగా గాయపడిన స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా.. ఇప్పుడు నాలుగో టెస్టుకు (ind vs eng) దూరం అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. జడేజాను.. మోకాలి గాయానికి సంబంధించి పరీక్షలు నిర్వహించేందుకు లీడ్స్‌లోని ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని జడ్డూ తన ఇన్‌స్టాలో షేర్ చేశాడు. ఇది నేను ఉండాల్సిన చోటు కాదని పేర్కొన్నాడు.
జడ్డూకు అయిన గాయం తీవ్రం కాదని జట్టు భావిస్తోంది. ఆగస్టు 30న టీమ్ ఇండియా లండన్‌కు బయలుదేరాల్సి ఉంది. ఈలోగా గాయం తీవ్రం కాదని డాక్టర్లు స్పష్టం చేస్తే.. జడ్డూ లండన్ టెస్టులో ఆడతాడు. ఒకవేళ జడ్డూ గాయం తీవ్రం అయితే అతడి స్థానంలో సీనియర్ ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ వచ్చే అవకాశం ఉంది.