బ్రిటన్‌లో పది రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకున్న టీమ్ఇండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి(Ravi Shastri Corona News), బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ స్వదేశానికి రావడానికి సిద్ధమవుతున్నారు. కొవిడ్ నుంచి కోలుకున్న వారు ప్రయాణం చేయాలంటే 'ఫిట్ టు ఫ్లై'(Team India Corona Report) పరీక్షకు హాజరు కావాల్సి వుంటుంది. ఆర్టీ-పీసీఆర్ పరీక్షలో మరోసారి వారికి నెగెటివ్ కూడా రావాలి.
Ravi shastri Covid: కోలుకున్న రవిశాస్త్రి.. త్వరలో భారత్‌కు!
టీమ్ఇండియా ప్రధానకోచ్ రవిశాస్త్రితో పాటు బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్‌లు కరోనా నుంచి కోలుకున్నారని(Team India Corona Report) ఓ బీసీసీఐ అధికారి వెల్లడించారు. 'ఫిట్ టు ఫ్లై' పరీక్షలో వచ్చే ఫలితాలను బట్టి వారు స్వదేశానికి తిరిగి వస్తారని ఆయన తెలిపారు.
కరోనా నుంచి కోలుకున్న రవిశాస్త్రి.. త్వరలో భారత్‌కు పయనం!
"శాస్త్రి, అరుణ్, శ్రీధర్ కరోనా నుంచి కోలుకున్నారు. శారీరకంగా బాగానే ఉన్నారు. ఐసోలేషన్‌ను వీడారు. అయితే వాళ్లు 'ఫిట్ టు ఫ్లై' సర్టిఫికేట్ పొందాలటే సీటీ స్కోరు 38+ రావాలి. వచ్చే రెండో రోజుల్లో కోచ్‌లు బయల్దేరతారని భావిస్తున్నాం" అని ఓ సీనియర్ బీసీసీఐ అధికారి చెప్పాడు.
ఇదీ చూడండి..Kohli Captaincy: కోహ్లీ నిర్ణయం వెనుక కారణాలేంటో?