తెలంగాణ

telangana

ETV Bharat / sports

'చాహల్‌ ఫోన్‌ చేసి చెబితే జోక్‌ అనుకున్నా' - తెవాటియా చాహల్​ ఫోన్

టీమ్​ఇండియాకు ఎంపికయ్యానని స్పిన్నర్​ యుజ్వేంద్ర చాహల్​ చెబితే జోక్​ చేస్తున్నాడని అనుకున్నానని యువ క్రికెటర్​ రాహుల్​ తెవాతియా అన్నాడు. అయితే, ఇంత త్వరగా భారత జట్టులో స్థానం దక్కుతుందని తాను ఊహించలేదని తెలిపాడు.

Rahul Tewatia reveals Yuzvendra Chahal informed him about his India call-up
'చాహల్‌ ఫోన్‌ చేసి చెబితే జోక్‌ అనుకున్నా'

By

Published : Feb 22, 2021, 8:46 AM IST

Updated : Feb 22, 2021, 12:22 PM IST

ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికయ్యానని చాహల్‌ ఫోన్‌ చేసి చెబితే జోక్‌ చేస్తున్నాడని అనుకున్నానని యువ ఆల్​రౌండర్​ రాహుల్‌ తెవాతియా అన్నాడు. ఇంగ్లీష్‌ జట్టుతో టెస్టు సిరీస్‌ తర్వాత మొతేరాలో జరగబోయే ఐదు టీ20ల సిరీస్‌కు శనివారం రాత్రి బీసీసీఐ 19 మంది ఆటగాళ్ల జాబితాను విడుదల చేసింది. ఈ క్రమంలోనే ఐపీఎల్‌లో మంచి ప్రదర్శన చేసిన ముంబయి ఆటగాళ్లు సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌తో పాటు రాజస్థాన్‌ ఆల్‌రౌండర్‌ తెవాతియా తొలిసారి టీమ్ఇండియాలో చోటు కల్పించింది.

"నేను టీమ్‌ఇండియాకు ఎంపికయ్యానని చాహల్‌ భాయ్‌ ఫోన్‌చేసి చెబితే జోక్‌ చేస్తున్నాడేమో అనుకున్నా. తర్వాత మోహిత్‌ శర్మ కూడా నా వద్దకొచ్చి అదే విషయం చెప్పాడు. చాలా సంతోషమేసింది. అయితే, ఇంత త్వరగా భారత్‌ జట్టుకు ఎంపికౌతానని అస్సలు ఊహించలేదు. జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నా. హరియాణా నుంచి ఇప్పటికే ముగ్గురు స్పిన్నర్లు చాహల్‌, అమిత్‌ మిశ్రా, జయంత్‌ యాదవ్‌ టీమ్‌ఇండియాకు ఆడారు. నాకు అవకాశం వస్తే దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఐపీఎల్‌ ద్వారా ప్రజలు నన్ను గుర్తుపడుతున్నారు. ఇలాగే మంచి ప్రదర్శన చేస్తే టీమ్‌ఇండియాకు ఎంపికౌతానని అనుకున్నా. కానీ, ఇంత త్వరగా అని మాత్రం అనుకోలేదు"

- రాహుల్​ తెవాతియా, యువ క్రికెటర్​

అయితే, గతేడాది యూఏఈలో జరిగిన ఐపీఎల్‌ మెగా ఈవెంట్‌లో పంజాబ్‌తో తలపడిన ఓ లీగ్‌ మ్యాచ్‌లో రాహుల్‌ (53; 31 బంతుల్లో 7x6) చెలరేగిపోయాడు. ఓటమివైపు వెళుతున్న రాజస్థాన్‌ను తన సిక్సుల వర్షంతో గెలిపించాడు. కాట్రెల్‌ వేసిన 18వ ఓవర్‌లో ఐదు సిక్సులు బాది అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఆ ఒక్క ఇన్నింగ్స్‌తో తన పేరు మొత్తం సామాజిక మాధ్యమాల్లో మార్మోగిపోయేలా చేసుకున్నాడు. తర్వాత పలు మ్యాచ్‌ల్లోనూ మంచి బ్యాటింగ్‌ ప్రదర్శన చేయడం వల్ల ఇప్పుడు ఇంగ్లాండ్‌ సిరీస్‌కు ఎంపికయ్యాడు.

ఇదీ చూడండి:ఐపీఎల్​ వేలంలో అన్​సోల్డ్​పై ఫించ్​ రియాక్షన్

Last Updated : Feb 22, 2021, 12:22 PM IST

ABOUT THE AUTHOR

...view details