ఇంగ్లాండ్తో జరగాల్సిన ఆఖరి టెస్టు రద్దు కావడంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI News) ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా(BCCI Vice President) స్పందించారు. కరోనా కేసుల నేపథ్యంలో మ్యాచ్ను ఇప్పటికైతై రద్దు చేసినట్లు తెలిపారు. అయితే ఇదే మ్యాచ్ను తిరిగి ఎప్పుడు నిర్వహించాలనే దానిపై త్వరలోనే స్పష్టత ఇస్తామని వెల్లడించారు.
"ఎన్నో సంప్రదింపుల తర్వాత బీసీసీఐ అధ్యక్షుడు, కార్యదర్శి, ట్రెజరర్, జాయింట్ సెక్రటరీ.. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఛైర్మన్, సీఈఓలతో పాటు ఇరుజట్ల కెప్టెన్లు సమావేశమై.. మాంచెస్టర్ టెస్టును రద్దు చేయాలని నిర్ణయించాం. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఇంగ్లాండ్ బోర్డుతో స్నేహపూర్వకంగా చర్చిస్తున్నాం. కరోనా కేసుల నేపథ్యంలో ఆఖరి మ్యాచ్ను ఆపేయాలనుకున్నాం కానీ, పూర్తిగా రద్దు చేసే అవకాశమే లేదు".
- రాజీవ్ శుక్లా, బీసీసీఐ ఉపాధ్యక్షుడు