తెలంగాణ

telangana

ETV Bharat / sports

IND Vs ENG: టెస్టు రద్దుతో ఈసీబీకి నష్టమెంతో తెలుసా? - మాంచెస్టర్​ టెస్టు రద్దు

టీమ్ఇండియాతో ఐదో టెస్టు(IND Vs ENG 5th Test) రద్దు కారణంగా ఇంగ్లాండ్​ క్రికెట్​ బోర్డుకు భారీ నష్టం వాటిల్లింది. దీంతో పాటు మాంచెస్టర్​ స్టేడియాన్ని నిర్వహిస్తున్న లాంకషైర్​ క్రికెట్​పై(Lancashire Cricket) కూడా ఆ ప్రభావం పడిందని ఈసీబీ(ECB News) అధికారులు అంటున్నారు. దాదాపుగా వందల కోట్ల నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు.

'Multimillion pound' losses after cancellation of 5th Test, says Lancashire CEO
IND Vs ENG: టెస్టు రద్దుతో ఈసీబీకి నష్టమెంతో తెలుసా?

By

Published : Sep 11, 2021, 6:01 AM IST

భారత్​, ఇంగ్లాండ్(India Vs England) మధ్య ఐదో టెస్టు రద్దు కారణంగా మాంచెస్టర్​ స్టేడియాన్ని నిర్వహిస్తున్న లాంకషైర్​తో పాటు ఇంగ్లాండ్​ క్రికెట్ బోర్డుకు భారీ నష్టం వాటిల్లింది. దాదాపుగా 30 మిలియన్ పౌండ్లు(రూ.304 కోట్లు) నష్టం వాటిల్లిందని ఈసీబీ అధికారి ఒకరు పేర్కొన్నారు. ​

భారత బృందంలో కరోనా కేసుల(Corona in Indian Cases) నేపథ్యంలో ఈ మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ఇరుజట్లు విరివిగా ప్రకటించాయి. అయితే, త్వరలోనే ఈ మ్యాచ్‌ను తిరిగి నిర్వహించేందుకు ఇంగ్లాండ్‌, వేల్స్‌ క్రికెట్‌ బోర్డుతో(ECB News) చర్చలు జరుపుతున్నామని బీసీసీఐ వెల్లడించింది. ఇరు బోర్డుల పరస్పర అంగీకారంతో శుక్రవారం జరగాల్సిన ఐదో టెస్టును నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. తొలుత ఈ మ్యాచ్‌ను నిర్వహించాలని భావించామని, అయితే.. ఆటగాళ్ల భద్రత నేపథ్యంలో చర్చల అనంతరం రద్దు చేయడానికి ఏకాభిప్రాయానికి వచ్చినట్లు వివరించారు.

అయితే, ఐదో టెస్టును(India Vs England Test Series) త్వరలోనే మళ్లీ నిర్వహించేందుకు ఈసీబీ(ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు)తో కలిసి పనిచేస్తామని బీసీసీఐ సెక్రటరీ జైషా అన్నారు. ఈ కష్ట సమయాల్లో తమ పరిస్థితిని అర్థం చేసుకొని సహకరించినందుకు ఈసీబీకి ఆయన ధన్యవాదాలు చెప్పారు.

ఇదీ చూడండి..IPL 2021: ఆటగాళ్ల కోసం ప్రత్యేక విమానాలు.. సీఎస్​కే తప్ప!

ABOUT THE AUTHOR

...view details