చెపాక్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత్ నిలకడగా ఆడుతోంది. భోజన విరామ సమయానికి 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. ప్రస్తుతం 351 పరుగుల ఆధిక్యంలో ఉంది. క్రీజులో కెప్టెన్ కోహ్లీ (38), అశ్విన్ (34) పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో లీచ్ 3, మొయిన్ అలీ 2 వికెట్లు తీసుకున్నారు.
స్పిన్‌కు సహకరిస్తున్న పిచ్‌పై మొదట్లో కాస్త తడబడింది టీమ్ఇండియా. వరుసగా వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అశ్విన్.. కోహ్లీతో కలిసి ధాటిగా ఆడుతున్నాడు. త్వరత్వరగా పరుగులు తీస్తూ కెప్టెన్‌పై ఒత్తిడిని తొలగించాడు. ఈ క్రమంలోనే ఈ జంట 50 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది.