మొదటి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత్ పీకల్లోతు కష్టాల్లో ఉంది. భోజన విరామ సమయానికి 6 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లీ(45), అశ్విన్(2) ఉన్నారు. ఓవర్‌నైట్ స్కోరు 39/1తో అయిదవ రోజు ఆట కొనసాగించిన భారత్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. కుదురుకుంటున్నట్లు కనిపించిన పుజారాను లీచ్ ఔట్ చేశాడు.
ఒకే ఓవర్లో రెండు..
పిచ్ నుంచి లభిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకున్న ఇంగ్లాండ్ పేసర్ అండర్సన్ ఒకే ఓవర్లో ఇద్దరిని ఔట్ చేశాడు. అర్ధ సెంచరీతో ఊపు మీద కనిపించిన గిల్.. అండర్సన్ వేసిన ఇన్స్వింగ్కు పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఆజింక్య రహానెను చక్కటి డెలివరీతో బౌల్డ్ చేశాడు అండర్సన్. తొలి ఇన్నింగ్స్‌లో ఒక్క పరుగు మాత్రమే చేసిన రహానె, ఈ ఇన్నింగ్స్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు.
రిషభ్‌పంత్ 11 పరుగులు చేసి క్యాచ్ ఔటయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న సుందర్ డకౌటయ్యాడు. భారత్ ఓటమి నుంచి తప్పించుకోవాలంటే కోహ్లీ ఎక్కువ సేపు క్రీజులో ఉండక తప్పదు.
ఇదీ చదవండి:'విరాట్.. అంపైర్లను ప్రభావితం చేస్తున్నాడు!'