తెలంగాణ

telangana

ETV Bharat / sports

Ind vs End: 'కోహ్లీసేనను రక్షించేందుకే వర్షం వచ్చిందంట!' - డబ్ల్యూటీసీ 2

తొలి టెస్టులో భారత్​ను రక్షించేందుకే వరుణుడు వచ్చాడని ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ మైకేల్‌ వాన్‌ వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. అయితే.. ఆతిథ్య జట్టుపై తొలి టెస్టు గెలిచి శుభారంభం చేసే అవకాశం టీమ్‌ఇండియాకు త్రుటిలో చేజారింది. ఆట ఆఖరి రోజు వర్షం రావడమే ఇందుకు కారణం.

Michael Vaughn news
మైకేల్ వాన్​

By

Published : Aug 9, 2021, 3:00 PM IST

ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ మైకేల్‌ వాన్‌ టీమ్‌ఇండియాపై సెటైర్లు వేయడం ఇంకా మానుకోలేదు! ఇంగ్లాండ్‌తో తొలి టెస్టు వర్షంతో నిలిచిపోయిన సందర్భంలోనూ అతడు వ్యంగ్యంగా ట్వీట్‌ చేశాడు. కోహ్లీసేనను రక్షించేందుకే వరుణుడు వచ్చాడట! అని.

ఆతిథ్య జట్టుపై తొలి టెస్టు గెలిచి శుభారంభం చేసే అవకాశం టీమ్‌ఇండియాకు త్రుటిలో చేజారింది. ఆట ఆఖరి రోజు వర్షం రావడమే ఇందుకు కారణం. ఈ పోరులో తొలుత బ్యాటింగ్‌కు దిగిన జో రూట్‌ సేనను కోహ్లీసేన దెబ్బకొట్టింది. జస్ప్రీత్‌ బుమ్రా (4/46), మహ్మద్‌ షమి (3/28) చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్‌లో 183 పరుగులకే కుప్పకూలింది. కేఎల్‌ రాహుల్‌ (84), రవీంద్ర జడేజా (56) రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 278 పరుగులు చేసింది.

రెండో ఇన్నింగ్స్‌ను 95 పరుగుల లోటుతో ఆరంభించిన ఇంగ్లాండ్‌ 303 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ జో రూట్‌ (109) శతకం చేయడంతో ఫర్వాలేదనిపించింది. 209 పరుగుల లక్ష్యంతో ఛేదన ఆరంభించిన భారత్‌ నాలుగో రోజు ఆట ముగిసే సరికి 52/1తో నిలిచింది. ఆఖరి రోజు 150 పైచిలుకు పరుగులు చేయడం కోహ్లీసేనకు కష్టమేం కాదు. అలాంటి సమయంలో రోజంతా వర్షం కురవడంతో ఆటను రద్దు చేశారు. ఫలితంగా మ్యాచ్‌ డ్రా అయింది.

వాన్​ ట్వీట్​

భారత్‌ గెలుపు అవకాశాలను వరుణుడు దెబ్బకొట్టడంతో మైకేల్‌ వాన్‌ సెటైర్‌ వేశాడు. 'చూస్తుంటే ఇక్కడ భారతీయులను వర్షం రక్షిస్తున్నట్టు ఉంది..' అని ట్వీట్‌ చేశాడు. పరోక్షంగా ఇది ఇంగ్లాండ్​ను ఉద్దేశించి చేసిందే అయినా భారత జట్టుపై అతడు విసిరే వ్యంగ్య ట్వీట్ల గురించి మనకు తెలిసిందే.

ఇదీ చదవండి:డబ్ల్యూటీసీ-2లో ఖాతా తెరిచిన ఇండియా, ఇంగ్లాండ్

ABOUT THE AUTHOR

...view details