గత ఇంగ్లాండ్ పర్యటనలో తాను చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకున్నానని టీమ్ఇండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ తెలిపాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో తన 84పరుగులతో జట్టును ఆదుకున్న రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
"టెస్ట్ క్రికెట్లో ప్రతి బంతిని ఎదుర్కోవడానికి రెండు, మూడు రకాల షాట్లు ఆడగలను. పరిస్థితిని అర్థం చేసుకుని ఆడటం నేర్చుకున్నాను. మంచి బౌలర్లను ఎదుర్కొనేటప్పుడు, బంతి స్వింగ్ అయినప్పుడు భిన్నమైన షాట్లు ఆడగలగాలి. గత పర్యటన(2018)లో విఫలమైన్నప్పటి నుంచి షాట్ల ఎంపికపై బాగా దృష్టి పెట్టి ప్రాక్టీస్ చేశాను. మైదానం బయట కూర్చునేటప్పుడు కూడా లోపల బాగా ఆడే బ్యాట్స్‌మెన్ ఆటను గమనిస్తూ మెలకువలు నేర్చుకుంటున్నాను. ఏ ఫార్మాటైనా షాట్లు ఎంపిక అనేది చాలా ముఖ్యం. ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా జట్టుకు మంచి స్కోర్‌ను అందించాను. టీమ్ కోసం ఏదైనా చేసేందుకు సిద్ధం. టీమ్ మేనేజ్మెంట్ ఏ స్థానంలో ఆడమన్నా సిద్ధంగా ఉన్నాను. ఇంగ్లాండ్‌లో ఆడటం సవాల్ లాంటిది. వారిది ప్రపంచస్థాయి బౌలింగ్. అండర్సన్, బ్రాడ్ ఎన్నో నైపుణ్యాలు కలిగిన ఆటగాళ్లు. వారి ఆటను చూస్తే ఆర్థమవుతుంది. వారి బంతులను ఎదుర్కోవడం సవాల్ లాంటిది."