అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరగనున్న నాలుగో (తుది) టెస్టు కోసం భారత ఆటగాళ్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్లో బీసీసీఐ పోస్ట్ చేసింది. కెప్టెన్ కోహ్లీ, వైస్‌కెప్టెన్ అజింక్య రహానె నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తుండగా.. కోచ్ రవిశాస్త్రితో రోహిత్ శర్మ బ్యాటింగ్ ప్రణాళికల గురించి చర్చిస్తున్నాడు.
ప్రాక్టీస్‌లో భాగంగా వార్మప్ చేస్తున్న ఫొటోను వైస్ కెప్టెన్ అజింక్య రహానె ట్విట్టర్లో పంచుకున్నాడు. "చివరి మ్యాచ్ ఆడడానికి సమయం దగ్గర పడనున్న క్రమంలో పరిమితులకు మించి శ్రమించాల్సి ఉంది" అని ఆ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చాడు.