మార్చి 4 నుంచి ఇంగ్లాండ్‌తో జరగనున్న నిర్ణయాత్మక టెస్టు కోసం టీమ్ఇండియా తీవ్రంగా శ్రమిస్తోంది. సోమవారం నెట్స్‌లో ప్రాక్టీస్ చేసిన భారత ఆటగాళ్లు.. మంగళవారం ఫీల్డింగ్‌పై దృష్టి సారించారు. ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్ నేతృత్వంలో సాగిన ప్రాక్టీస్‌కు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ షేర్ చేసింది.
బ్యాట్స్‌మన్ మయాంక్ అగర్వాల్ డైవింగ్ క్యాచ్‌లు ప్రాక్టీస్ చేస్తుండగా.. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ త్రోలో శిక్షణ తీసుకుంటున్నాడు. వీరితో పాటు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, పేసర్ ఉమేశ్ యాదవ్ క్యాచ్‌లు ప్రాక్టీస్ చేస్తున్నారు.