ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో(Ind vs Eng 4th test 2021) టీమ్‌ఇండియా 157 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. చివరి రోజు ఆతిథ్య జట్టు పది వికెట్లు తీసి సిరీస్‌లో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ నిర్దేశించిన 368 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆతిథ్య జట్టు 210 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌లో ఓపెనర్లు హసీబ్ హమీద్ (63; 193 బంతుల్లో 6x4), రోరీ బర్న్స్ (50; 125 బంతుల్లో 5x4) అర్ధశతకాలతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. కెప్టెన్ జోరూట్ (36; 78 బంతుల్లో 3x4) క్రీజులో పాతుకుపోయేందుకు ప్రయత్నించినా నిలవలేకపోయాడు. ఇక ఇతర బ్యాట్స్‌మెన్ ఎవరూ కనీస పోరాటం చేయకుండా పెవిలియన్ చేరడం వల్ల భారత్ అద్భుత విజయం సాధించింది.
IND Vs ENG: నాలుగో టెస్టు హైలైట్స్! - నాలుగో టెస్టు హైలైట్స్
ఓవల్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో(Ind vs Eng 4th test 2021) ఇంగ్లాండ్‌పై 157 పరుగుల తేడాతో టీమ్ఇండియా ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 2-1తో భారత్ ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ సందర్భంగా ఈ మ్యాచ్ హైలైట్స్ మీ కోసం..
టీమ్ఇండియా
నాలుగో టెస్టు హైలైట్స్(Ind vs Eng Match Highlights)..
- టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియా.. తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు కుప్పకూలింది.
- తొలి ఇన్నింగ్స్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ(50), శార్దూల్ ఠాకూర్(57) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు.
- ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 4 వికెట్లు పడగొట్టగా.. రాబిన్సన్ 3, జేమ్స్ అండర్సన్, క్రెయిగ్ ఓవర్టన్ చెరో వికెట్ సాధించారు.
- ఆ తర్వాత బరిలో దిగిన ఆతిథ్య జట్టు.. 290 పరుగులకే ఆలౌటైంది.
- ఓలీ పోప్(81), క్రిస్ ఓక్స్ అర్ధశతకాలతో ఆకట్టుకునే ప్రదర్శన చేశారు.
- ఉమేశ్ యాదవ్ 3 వికెట్లు.. బుమ్రా, జడేజా చెరో 2 వికెట్లు.. శార్దూల్ ఠాకూర్, సిరాజ్ తలో వికెట్ సాధించారు.
- రెండో ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు నమోదు లక్ష్యంలో బరిలో దిగిన కోహ్లీసేన.. 466 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది.
- రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ(127) శతకంతో మెరిశాడు. పుజారా(61), రిషబ్ పంత్(50), శార్దూల్ ఠాకూర్(60) హాఫ్‌సెంచరీలు సాధించారు.
- 367 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లాండ్.. 210 పరుగులకే చేతులెత్తేసింది. ఫలితంగా 157 పరుగుల తేడాతో కోహ్లీసేన విజయం సాధించింది.
- రోరీ బర్న్స్(50), హసీబ్ హమీద్(63) హాఫ్‌సెంచరీలతో అలరించగా.. మిగిలిన బ్యాట్స్‌మెన్ మెప్పించలేకపోయారు. మరోసారి ఉమేశ్ యాదవ్ 3 వికెట్లు సాధించగా.. బుమ్రా, జడేజా, శార్దూల్ ఠాకూర్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.
- ఇదే మ్యాచ్‌లో రోహిత్ శర్మ.. టెస్టుల్లో 3 వేల పరుగులు మైలురాయిని చేరుకున్నాడు.
- టెస్టు క్రికెట్లో అత్యంత వేగంగా 100 వికెట్లు సాధించిన టీమ్ఇండియా బౌలర్లలో జస్ప్రిత్ బుమ్రా అగ్రస్థానంలో నిలిచాడు. 24 మ్యాచ్‌ల్లో ఈ ఘనతను సాధించాడు.
ఇదీ చదవండి:అప్పుడు ఆస్ట్రేలియా.. ఇప్పుడు ఇంగ్లాండ్!