మార్చి 4 నుంచి ఇంగ్లాండ్తో జరగనున్న నిర్ణయాత్మక టెస్టు తుదిజట్టు నుంచి తప్పుకున్నాడు టీమ్ఇండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా. వ్యక్తిగత కారణాలతో తనను జట్టు ఎంపికలో పరిగణించవద్దని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)ని కోరాడు. అయితే ఈ నేపథ్యంలో బుమ్రా పెళ్లికి సిద్ధమయ్యాడనే వార్తలు వినిపిస్తున్నాయి. వివాహం కోసం కొన్ని రోజుల పాటు సెలవు కోరినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని బీసీసీఐ వర్గాలు ధ్రువీకరించాయి.
"తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు బీసీసీఐకి బుమ్రా సమాచారమిచ్చాడు. దీంతో వివాహానికి ముందు కొన్ని రోజులు సెలవు తీసుకున్నాడు." అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.